వేసవిలో మరింత వేడెక్కిస్తున్న రుహాని శర్మ...!!

murali krishna
ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ సోషల్ మీడియాలో పరిధి దాటి  మరి అందాలు ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గాయి అనుకుంటున్న సమయంలో మేము కూడా రేసులో ఉన్నామని చెప్పుకోవడం కోసం అందాలు ఆరబోయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు మన హీరోయిన్స్.
అందులో భాగంగా మొదట పద్ధతైన పాత్రల ద్వారా తెలుగు వారిని పలకరించిన రహానే శర్మ కూడా రెచ్చిపోయి మరి అందాలు ఆరబోసింది. హిమాచల్ ప్రదేశ్ లోని సొలాన్ అనే ప్రాంతంలో పుట్టి పెరిగిందట రహానే శర్మ. చండీగఢ్ లోని పంజాబ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన ఆమె ముందుగా పంజాబీ మ్యూజిక్ వీడియోలలో కనిపించి మెప్పించింది.. అలా ఆమెను చూసిన ఒక తమిళ డైరెక్టర్ ఆమెకు ఒక సినిమాలో అవకాశం కూడా ఇచ్చారు. అలా ఆమె కాదాసీ బెంచి కార్తీ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిందట అది పెద్దగా వర్కౌట్ కాలేదట..
 
దీంతో అక్కినేని హీరో సుశాంత్ - రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్‌లో వచ్చిన 'చిలసౌ' సినిమతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది రుహానీ శర్మ. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది ఆమె. ఈ సినిమాలో ఆమె నటన చూసి తర్వాత ఆమెకు ఎన్నో అవకాశాలు వస్తాయని అందరు అనుకున్నారు. కానీ, పరిస్థితి తారుమారైంది. 'చిలసౌ' తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, ఆ సినిమా కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది.

 ఆ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నాక కూడా తెలుగులో ఆమెకు అవకాశాలు అస్సలు దక్కలేదు. దీంతో మలయాళ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమెకు అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైంది.. చాలా గ్యాప్ తర్వాత ఆమె విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత డర్టీ హరి అనే బోల్డ్ సినిమాలో కూడా ఆమె నటించింది. ఈ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.. ఇక ఆమె నటించిన నూటొక్క జిల్లాల అందగాడు సినిమా అయితే మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ప్రస్తుతానికి ఆమెకు చేతిలో ఒకే తెలుగు సినిమా ఉందట..
 
దీంతో రుహానీ శర్మ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తన అభిమానులతో ఎప్పుడూ  కూడా అందుబాటులో ఉంటుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను తరచూ అందులో పోస్ట్ చేస్తూ ఉంటుందట.. ఈ క్రమంలోనే తన ఫోటోలను, వీడియోలను సైతం పోస్ట్ చేస్తుంది రుహానీ శర్మ. ఇందులో భాగంగానే రుహానీ శర్మ ప్రత్యేకంగా ఫోటో సెషన్‌కు హాట్ హాట్‌గా పోజులు ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన వారంతా కూడా షాక్‌కు గురయ్యారు.
 
వాటిలో ఉన్నది రుహానీ అంటే అస్సలు నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఆమె అంతగా బోల్డ్ ఫోటో షూట్ చేసింది. మరి బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉన్న ఫొటోలో క్లీవేజ్ షోతో యువతను, ఫిల్మ్ మేకర్లను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది రుహానీ శర్మ. దీంతో ఈ ఫొటోలకు విపరీతమైన రెస్పాన్స్  అయితే వస్తోంది. ఇప్పటికే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో  బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరి ఇప్పటికైనా రుహానీ శర్మ లక్కు మారుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: