కనీసం రూ.2 వేల సంపాదన కూడా లేదంటున్న శృతి హాసన్ తల్లి..!!

Divya
తనకు తగినన్ని అవకాశాలు లేకపోవడంతో కొన్నాళ్లుగా సినిమాల నుంచి తప్పుకుంది కమలహాసన్ మాజీ భార్య సారిక. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తనకు ఆదాయం లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డానని తెలియజేస్తోంది సారిక. ఆమె వద్ద ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయని తిరిగి థియేటర్ రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లుగా ఆమె తెలియజేసింది. కానీ అక్కడ రెండు వేల రూపాయల సంపాదన రావడమే చాలా కష్టమని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. అందుకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ప్రముఖ జాతీయ మీడియాలో ఇంటర్వ్యూకి హాజరైన సారిక మాట్లాడుతూ తాను ఐదు సంవత్సరాలుగా థియేటర్ రంగంలో చాలా అద్భుతమైన జీవితాన్ని గడిపానని.. అయితే థియేటర్ మాత్రమే తనని నటిగా నిలబెట్టిందని తెలియజేసింది. కానీ ఎక్కువ కాలం తన తిరిగే ఉద్యోగాలను చేయవలసి వచ్చిందని తెలియజేస్తోంది. తను నాటకాలు వేసుకుంటూ రూ.2,000 కంటే తక్కువ సంపాదించే దానిని అని తెలియజేసింది. ఆ వచ్చిన డబ్బులు తనను తాను పోషించుకోవడానికి అసలు సరిపోయేవి కాదని తెలిపింది. ఇక అలాంటి సమయంలోనే తన జీవితాన్ని తాను వృధా చేసుకుంటున్నాం ఏమో అనుకున్నట్లుగా అనిపించింది అని తెలియజేసింది. అందుచేతనే ఒక ఏడాది పాటు దూరంగా వెళ్లి ఏదైనా భిన్నమైన పని చేశానని తెలియజేసింది.
సారిక మాట్లాడుతూ .. లాక్ డౌన్ వల్ల తన డబ్బు మొత్తం అయిపోయింది కాబట్టి ఎక్కడికి వెళ్లాలో తెలియక.. తిరిగి థియేటర్ పని లోకి అడుగు పెట్టవలసివచ్చింది అని తెలియజేసింది. దాంతో ఇక చేసేదేమీ లేక ఒక ఏడాది పాటు చేద్దామని అనుకున్నాను. కానీ అది ఐదేళ్ల అయిపోయింది.. ఈ 5 సంవత్సరాలు మర్చిపోలేనివని తెలియజేసింది. అయితే శృతిహాసన్ ఒక్కో సినిమాకి రూ.2 కోట్ల రూపాయలు అందుకుంటోంది. లాక్ డౌన్ సమయంలో కూడా తాను కూడా EMI కట్టలేని పరిస్థితిలో ఉన్నాను అని తెలియజేసింది. దీంతో తమతో పాటు ఎంతో మంది కార్మికులు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని  గతంలో తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: