రామ్ పోతినేని 'ది వారియర్' మూవీ బడ్జెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు వాడిన రామ్ పోతినేని గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ పోతినేని హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా దేవదాసు తోనే మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. రామ్ పోతినేని  ఆ తర్వాత  రెడీ , కందిరీగ , ఈస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ సినిమా లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరోగా మారిపోయాడు.  ఈస్మార్ట్ శంకర్ మూవీ తో ఫుల్ మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్న రామ్ పోతినేని ఆ తర్వాత రెడ్ మూవీ లో హీరోగా నటించాడు.  

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే రిజల్ట్ ను సాధించింది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ పోతినేని 'ది వారియర్' మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.  ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ఆది పినిశెట్టి కనిపించబోతున్నాడు.  ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకురుస్తూ ఉండగా,  ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా పాటలలో నుంచి ఒక పాటను చిత్ర బృందం విడుదల చేయగా ఆ పాటకు  ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.  

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతుంది. అసలు విషయంలోకి వెళ్తే...  రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న 'ది వారియర్'  సినిమాకు  ఇప్పటికే 70 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.  అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలి ఉండటం,  అలాగే ప్రచారాలకు కలిపి దాదాపు ఇంకో ఐదు కోట్ల వరకు ఖర్చు కానున్నట్లు తెలుస్తోంది.  మొత్తంగా ఈ సినిమాకు 75 కోట్ల ఖర్చు కానున్నట్లు తెలుస్తోంది.  ఇలా రామ్ పోతినేని సినిమాకు అదిరిపోయే బడ్జెట్ ను పెట్టినట్లు ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: