ఏందయ్యా ఇది : మహేష్ బాబా ... మజాకా .... ??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ తో తొలిసారిగా పరశురామ్ తీస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట రేపు భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో ప్రేక్షకాభిమానులు ముందుకు రానున్న విషయం తెల్సిందే. మహేష్ తో తొలిసారిగా కీర్తి సురేష్ జత కడుతున్న ఈ మూవీ ని గీత గోవిందం వంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల తీస్తుండగా మది ఫోటోగ్రఫిని అలానే థమన్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే ఈ సినిమాపై మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఈ మూవీలో మహేష్ లుక్స్, స్టైలిష్ డైలాగ్స్, అదిరిపోయే సాంగ్స్ బయటకు వచ్చిన దగ్గరి నుండి అందరూ మూవీ తప్పకుండా మంచి సక్సెస్ కొడుతుందని అంచనాలు పెట్టుకున్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెరగడంతో రెండు రోజుల క్రితం ఈ సినిమా ప్రీ బుకింగ్స్ ని ఆన్ లైన్ లో ఓపెన్ చేసారు. అయితే మొదట్లో ఒకింత మెల్లగా బుకింగ్స్ ఉన్నాయని అందరూ భావించారు. మరోవైపు యుఎఏ లో హాలీవుడ్ మూవీ డాక్టర్ స్ట్రేంజ్ ఉండడంతో అక్కడ సర్కారు వారి పాట కి పెద్దగా ప్రీమియర్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ తక్కువ అని అందరూ భావించారు.
అయితే ఒక్కసారిగా అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ మహేష్ బాబు సూపర్ స్టార్ మ్యానియాతో నిన్న మధ్యాహ్నం నుండి దాదాపుగా అనేక ప్రాంతాల్లో సర్కారు వారి పాట ప్రీ బుకింగ్స్ రాకింగ్ గా దూసుకెళ్తున్నాయి. మరోవైపు నైజాం, ఆంధ్రా లోని కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజు పెద్ద రికార్డ్స్ వచ్చే ఛాన్స్ కనపడుతోందని, ముఖ్యంగా అటు యుఎస్ ఏ లో అయితే ఇప్పటికే ఈ మూవీ 650కె వరకు ప్రీమియర్ సేల్స్ కొల్లగొట్టిందని, ఇది అక్కడ పోస్ట్ ప్యాండమిక్ తరువాత వచ్చిన అతి పెద్ద నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డు అని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. మొత్తంగా మహేష్ తన పవర్, స్టామినాని మరొక్కసారి చూపిస్తున్న సర్కారు వారి పాట రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ కొడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: