అవతార్ 2 : స్వర్గంలా వున్న విజువల్స్!

Purushottham Vinay
ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రజల దృష్టిని ఆకర్షించే సినిమాలు తీస్తూ వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు జేమ్స్ కామెరూన్. ‘అవతార్‌’సినిమాతో ప్రేక్షకుల్ని పాండోరా గ్రహంలో విహరింపజేసిన కామెరూన్‌ ఇప్పుడీ సీక్వెల్ తో సముద్ర గర్భంలోని మరో కొత్త అందమైన లోకాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాడు.ఈ సంవత్సరం డిసెంబరు 16 వ తేదీన వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, స్టీఫెన్ లాంగ్, మిచెల్ రోడ్రిగ్జ్ ఇంకా సిగౌర్నీ వీవర్ ప్రధాన పాత్రలు పోషించారు.ఇటీవల కాన్ ఉత్సవాల్లో అవతార్ టీజర్ ని రిలీజ్ చేసారు. కానీ ఆలస్యంగా ఇంటర్నెట్ లో అందుబాటులోకి వచ్చింది. తాజాగా టీజర్ ట్రైలర్ అనేక భాషల్లో ఒకేసారి యూట్యూబ్ లో విడుదల చేశారు. ది వే ఆఫ్ వాటర్ అనేది నాలుగు అవతార్ సీక్వెల్ లలో ఒకటి .. ఈ సంవత్సరం డిసెంబర్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


ఇక తాజాగా నిన్న రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్ ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా ఆ టీజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని వింటూ ఉంటే నిజంగా స్వర్గం అంటూ ఉంటే ఇలా ఉంటుందా అన్నట్టు మంచి అనుభూతిని ఇస్తుంది.మొదటి సీక్వెల్ జేక్ సుల్లీ- నవీ నెయిటిరి వారి కుటుంబం ప్రమాదాల నుంచి కాపాడుకునేందుకు సరికొత్త ప్రాంతాన్ని  వారు అన్వేషంచడం ఈ టీజర్ లో కనిపిస్తోంది.అందులో భాగంగా సముద్రం విజువల్స్ అయితే కనుల విందు చేస్తున్నాయి. ఎంతో ప్రకాశవంతమైన ఆ నీలి జలాలు ఇంకా ప్రకృతి అందంగా కనిపిస్తున్నాయి. జేమ్ కామెరూన్ అవతార్ సినిమా 2009లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా కూడా 2.84 బిలియన్ డాలర్ల (సుమారు 30వేల కోట్లు)తో బాక్సాఫీస్ వద్ద ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత అవెంజర్స్ – ఎండ్ గేమ్ సినిమా టాప్ 2లో నిలిచింది. అవతార్ – ద వే ఆఫ్ వాటర్స్ మరోసారి తన పాత రికార్డులు బద్దలు కొట్టి సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: