F3 బ్యూటీ తో నటించనున్న బాలయ్య...!!

murali krishna
వరుస సినిమాలతో జోరు మీద ఉన్న మన బాలయ్య.. నెక్ట్స్ సినిమా అనిల్ రావిపూడితో చేయబోతున్నాడట . ఇక ఈసినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో తెగ షికారు చేస్తున్నాయి.

బాలకృష్ణ అఖండ జోరుతో వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నారట. ఇక అటు బాలయ్యతో సినిమా చేసే ఛాన్స్ కోసం అనిల్ రావిపూడి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడని సమాచారం.. అసలు బాలయ్య బాబు 100వ సినిమానే తాను చేయాలనుకున్నానని గతంలో వెల్లడించాడట అనిల్ కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదని ఆ తరువాత ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీ అయ్యారట.

ఇక ఈ మధ్యనే బాలకృష్ణకి అనిల్ ఒక అద్భుతమైన కథ చెప్పి మెప్పించాడని సమాచారం.దాంతో బాలయ్య బాబు ఓకే చెప్పడం కూడా జరిగిపోయిందని తెలుస్తుంది.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఇది బాలకృష్ణకి 107వ సినిమాగా తెరకెక్కుతుంది. రాయలసీమ నేపథ్యంలో సాగే పవర్ ఫుల్ కథతో సినిమా చేస్తున్నాడట బాలయ్య.

ఈ సినిమా తరువాత ఆయన అనిల్ రావిపూడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారట బాలకృష్ణ. ఇక ఈసినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈసినిమా కథ ఇప్పటి వరకు బాలయ్య అస్సలు చేయనంత కొత్తగా ఉంటుందట. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా డిజైన్ చేశాడట మన అనిల్. ఈ సినిమాలో 14 ఏళ్లు జైలు శిక్షను అనుభవించి వచ్చిన ఒక నేరస్థుడి పాత్రను బాలయ్య కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.

ఇక అందరు సీనియర్లకు వచ్చిన ఇబ్బందే బాలయ్య సినిమాకు కూడా వచ్చింది. హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అనే కన్ ఫ్యూజన్ లో ఉన్నారట . ఇక ఈ సినిమాలో బాలయ్య జోడీగా యంగ్ హీరోయిన్ అయిన మెహ్రీన్ నటించబోతున్నట్టు టాక్ గట్టిగా నడుస్తోంది. ఫస్టాఫ్ అంతా కూడా బాలయ్య మార్కు యాక్షన్ తోను .. సెకండాఫ్ అంతా కూడా అనిల్ మార్కు కామెడీతోను ఈ కథ నడుస్తుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: