నాని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో సింగిల్ రెడీ..

Satvika
న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజిగా ఉన్నాడు.. శ్యామ్ సింగరాయ్ సినిమా తో హిట్ ట్రాక్ లోకి వచ్చిన నాని ఇప్పుడు గ్యాప్ లేకుండా మరో రెండు, సినిమాలు చేస్తున్నాడు.నాని హీరోగా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‪గా తెరకెక్కుతోన్న చిత్రం 'అంటే సుందరానికీ'..ఈ సినిమాలో నాని కొత్త లుక్ లో అలరించనున్నాడు. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన పోస్టర్, ఫస్ట్ సింగిల్ విడుదల అయ్యాయి.పంచెకట్టు' పాట.. అన్నివర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను అందుకుంది.


తాజాగా చిత్ర సెకండ్ సింగిల్ 'ఎంత చిత్రం ను విడుదల చేసేందుకు మేకర్స్ తేదీని ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్  నిర్మాణంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి మరో పాటను ఈ నెల 9 న విడుదల చేసెందుకు రెడీ అవుతున్నారు.. ఈ మేరకు ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు.ఆ పోస్టర్ లో నాని, నజ్రీయా ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు కనిపిస్తుంది.నాని నిద్రపోతున్నట్లు నటిస్తూ నజ్రియాపై తల ఉంచడానికి ప్రయత్నిస్తుండగా.. నజ్రియా ప్రేమగా నానిని చెంపపై చేయివేసి ఆపడం బ్యూటీఫుల్ గా వుంది. సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు డిజైన్ చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇప్పటికే విడుదలైన టీజర్‪లో సుందరం పాత్రలో నాని డిఫరెంట్ వేరియేషన్స్‪లో అలరించారు..నాని బ్రాహ్మణ అబ్బాయి సుందరం పాత్రలో నటించగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా నటించింది. తెలుగులో 'అంటే సుందరానికీ'.. తమిళ్‪లో 'అడాడే సుందరా'.. మలయాళంలో 'ఆహా సుందరా' టైటిల్స్‪తో రానున్న ఈ చిత్రం మూడు భాషల్లో జూన్ 10 న విడుదల కానుంది.నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు ఇతర పాత్రలలో నటించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీత అందిస్తున్నారు. ఈ సినిమా నానికి ఎలాంటి టాక్ ను అందిస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: