ఈ రోజు ఆ సమయానికి...ఆ హీరో చేతుల మీదగా విడుదల కానున్న రాజశేఖర్ 'శేఖర్' మూవీ ట్రైలర్

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరు అయిన రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  అలనాటి కాలంలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రాజశేఖర్  ప్రస్తుత కాలంలో బాక్సాఫీస్ దగ్గర విజయాలను అందుకోవడంలో మాత్రం కాస్త వెనక పడ్డాడు. అయితే అలా వరుస విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకు లేకపోయినప్పటికీ రాజశేఖర్ అప్పుడప్పుడు మాత్రం మంచి విషయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకుంటున్నాడు.
 

వరుస పరాజయాలతో డీలా పడిపోయి ఉన్న  సమయంలో రాజశేఖర్,  ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గరుడ వేగ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. ఆ తర్వాత రాజశేఖర్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమాలో నటించాడు. సస్పెన్స్,  థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా రాజశేఖర్ కు బాక్సాఫీస్ దగ్గర నిరాశను మిగిల్చింది.  కల్కి సినిమా తర్వాత చాలా రోజులు సమయం తీసుకున్న రాజశేఖర్ మరి కొన్ని రోజుల్లో  'శేఖర్'  సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.  శేఖర్ మూవీ కి జీవిత దర్శకత్వం వహించారు.

కెరియర్ పరంగా రాజశేఖర్ కి ఇది 91వ మూవీ. మలయాళంలో మంచి విజయం సాధించిన జోసఫ్ సినిమాకు రీమేక్ గా శేఖర్ సినిమా తెరకెక్కుతోంది. ఇలా ఇప్పటికే విజయవంతమైన సినిమాను రీమేక్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.  ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని  ఉన్న శేఖర్ సినిమాను ఈ నెల 20 తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల సమయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. ఈ రోజు ఉదయం  11 గంటలకు హైదరాబాద్ - ఏఎంబీ సినిమాస్ లో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. అడివి శేష్ చేతుల మీదుగా శేఖర్ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: