ఈసారి ప్రేక్షకుల కోరిక మేరకే అంటున్న అనన్య నగాళ్ల..!

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు.  కొంత మంది స్టార్ హీరోల సరసన నటించి సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ ను దక్కించుకుంటూ ఉంటే,  మరి కొంత మంది చిన్న హీరోల సరసన నటించి నప్పటికీ ఆ సినిమా మంచి విజయం సాధించడంతో కూడా మంచి గుర్తింపు ను సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకుంటూ ఉంటారు. అలా మాములు చిన్న సినిమాల్లో నటించిప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో   మంచి గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్ లలో అనన్య నగాళ్ల ఒకరు.
 

అనన్య నగాళ్ళ 'మల్లేశం'  సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.  
ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ప్రియదర్శి భార్యగా నటించింది. అనన్య నగాళ్ల ఆ తర్వాత  ప్లే బ్యాక్ , వకీల్ సబ్  సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.  ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో అనన్య నాగల్లా కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.  

కాకపోతే ఎంత క్రేజ్ ఉన్నా కానీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం పెద్దగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రావడం లేదు.  ఇలా సినిమా అవకాశాలు తెలుగులో ఎక్కువగా లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అనన్య నగాళ్ల  యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ తో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది.  
అది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు అనన్య నగాళ్ల హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షాట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.  

అనన్య నగాళ్ల సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫుల్ ట్రెండీ గా ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటే , అప్పుడప్పుడు ఫుల్ ట్రెడిషనల్ లుక్ లో ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా అనన్య నగాళ్ల  తన ఇన్ స్టా లో ఫుల్ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.  తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ కలర్ సారీ కట్టుకొని , పూల పూల బ్లౌజ్ ను ధరించి, చాలా  ట్రెడిషనల్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ఈ ఫోటోలకు అనన్య నగాళ్ల 'ప్రేక్షకుల కోరిక'  మేరకు అనే కాప్షన్ ఇచ్చింది.  ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు సో బ్యూటిఫుల్ , బ్యూటిఫుల్ ప్రిన్సెస్ , ఫైర్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: