యమలీల @28.. ఎవరికి తెలియని ఆసక్తికర విషయాలు ఇవే..!

Divya
మొట్టమొదటిసారి కమెడియన్ ఆలీ హీరోగా ఇంద్రజ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం యమలీల . స్టార్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి సాహసం చేస్తూ కమెడియన్ ను హీరోగా పెట్టి ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఎన్నో విమర్శలకు గురి అయిన ఈ సినిమా విడుదలైన తర్వాత విమర్శకులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. కైకాల సత్యనారాయణ యముడు గా నటించిన ఈ సినిమాలో చిత్రగుప్తుడు గా బ్రహ్మానందం పండించిన కామెడీ కూడా ఒక రేంజిలో ప్రేక్షకులను మెప్పించింది. తనికెళ్ళ భరణి, మంజుభార్గవి, గుండు హనుమంతరావు, ఏ వి ఎస్, కోట శ్రీనివాస రావు వంటివారు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒక ప్రత్యేక పాటలో మెరిసి కృష్ణ అభిమానులకు ఊరట కలిగించారు. అయితే ఈ సినిమాలో మొదట మహేష్ బాబుతో చేయాలని అనుకున్నాడు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. కానీ ఆ సమయానికి మహేష్ బాబు ఇంకా చదువుకుంటున్నాడు. అప్పుడే హీరోగా వద్దు అని కృష్ణ చెప్పడంతో ఈ ఆఫర్ తిరస్కరించడం జరిగింది. నంబర్ వన్ మూవీతో ఎస్వీ కృష్ణారెడ్డి కృష్ణకు హిట్ ఇవ్వగా
 మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కడానికి  కూడా కృష్ణారెడ్డి సహాయపడ్డారు అందుకే దర్శకుడు మహేష్ కోసం సినిమా చెప్తే.. నో  చెప్పాల్సివచ్చింది అని ఎంతో బాధ పడిన కృష్ణ .. యమలీల సినిమాలో స్పెషల్ సాంగ్ లో డాన్స్ వేసి  ఎస్వీ కృష్ణారెడ్డి కి ఆనందం కలుగజేశారు.

మహేష్ బాబు  నో చెప్పినప్పటికీ ఆలీతో సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు కృష్ణారెడ్డి.  1994 ఏప్రిల్ 28 విడుదలైన ఈ సినిమా నిన్నటితో 28 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇక krishna REDDY' target='_blank' title='ఎస్ వి కృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఎస్ వి కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న సిరులోలికించే... నీ జీను ప్యాంటు చూసి బుల్లోడో .. వంటి పాటలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.  అయితే ఈ చిత్రాన్ని హిందీలో వెంకటేష్ హీరోగా పెట్టి తగ్ దీర్ వాలా అనే సినిమా గా రీమేక్ చేయించారు ప్రముఖ నిర్మాత.. డాక్టర్ డి. రామానాయుడు. యంగ్ హీరో వెంకటేష్,  రవీనాటాండన్ జంటగా నటించిన ఈ సినిమాకు మురళీమోహన్ రావు దర్శకత్వం వహించారు. కానీ హిందీ లో ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: