బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన ఇంటి నేమ్ ప్లేట్ కు పెట్టిన ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  షారుక్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాలతో హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.  ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న  షారుక్ ఖాన్ ప్రస్తుతం కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో  ఒకరిగా కొనసాగుతున్నాడు.  ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న షారుక్ ఖాన్ కొంత  కొంత కాలం పాటు ఏ సినిమాలో కూడా నటించకుండా ఉండిపోయాడు.  

కానీ ప్రస్తుతం మాత్రం షారుక్ ఖాన్ వరుస సినిమాలలో నటిస్తున్నాడు.  ప్రస్తుతం షారుఖ్ ఖాన్ , కత్రినా కైఫ్, అనుష్క శర్మలతో కలిసి ‘జీరో’ అనే మూవీ లో నటిస్తున్నాడు.   దీపికా పదుకొణె, జాన్ అబ్రహాం లతో కలిసి ‘పఠాన్’ అనే మరో మూవీ లోను షారుఖ్ ఖాన్ నటిస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో కూడా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన నయనతార హీరోయిన్ గా కనిపించబోతోంది. అలాగే రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో కూడా షారుక్ ఖాన్ ఒక సినిమాలో నటించబోతున్నాడు.  

ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ జోరు మీద ఉన్న షారుక్ ఖాన్ కు తన ఇల్లు ‘మన్నత్’ అంటే ఎంతో ఇష్టం. తాజాగా ఇంటికి కొన్ని మరమత్తులు చేయించారు. అందులో భాగంగా ఈ ఇంటికి నేమ్ ప్లేట్ ను తయారు చేయించారు. మన్నత్... ల్యాండ్స్... ఎండ్...  అంటూ నిలువు అక్షరాలతో ఈ నేమ్ ప్లేట్ ను రూపొందించారు. ఈ నేమ్ ప్లేట్ కు 25 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఒక నేమ్ ప్లేట్ కే ఇంత ఖర్చు పెట్టడంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: