రాజశేఖర్ 91వ సినిమా 'శేఖర్' వచ్చేది అప్పుడే..?

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ కథానాయకులలో ఒకరు అయిన రాజశేఖర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలనాటి కాలంలో రాజశేఖర్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. రాజశేఖర్ ఒకానొక సమయంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,  వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో పోటీపడి సినిమాలలో నటించాడు.  అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్  క్రేజ్ ను సంపాదించుకున్న రాజశేఖర్ ఆ తర్వాత మాత్రం వరుస పరాజయాలతో బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయాడు.

  అలాంటి సమయం లోనే రాజశేఖర్ అప్పుడప్పుడు కొన్ని విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.  ఇది ఇలా ఉంటే వరస పరాజయాలతో డీలా పడిపోయిన రాజశేఖర్  'గరుడ వేగ' సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చాడు.  గరుడ వేగ సినిమా తర్వాత రాజశేఖర్ 'కల్కి'  సినిమాలో హీరో గా నటించాడు.  ఈ సినిమా రాజశేఖర్ బాక్సాఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాజశేఖర్ 'శేఖర్'  సినిమాలు హీరోగా నటించాడు.  

రాజశేఖర్ కెరియర్ పరంగా శేఖర్ మూవీ  91వ సినిమా.  జీవిత రాజశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.  వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పిస్తున్న ఈ సినిమా పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై రూపొందింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ  విడుద‌ల తేదీ పోస్ట‌ర్‌ ను శ‌నివారం నాడు విలేక‌రుల స‌మావేశంలో విడుద‌ల చేశారు. మే 20 వ తేదీన రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన శేఖర్ సినిమాను విడుదల కానున్నట్లు జీవితా రాజశేఖర్ తెలియజేసింది. మరి కల్కి సినిమాతో బాక్సాఫీసు దగ్గర పరాజయాన్ని ఎదుర్కొన్న రాజశేఖర్ 'శేఖర్'  సినిమాతో ఎలాంటి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: