చీరకట్టులో మైమరపిస్తున్న అనన్య నగాళ్ల..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ అనన్య నగాళ్ల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనన్య నగాళ్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్లేశం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఈ సినిమాలో అనన్య నగాళ్ల ,  ప్రియదర్శి కి భార్య పాత్రలో నటించింది.  మల్లేశం సినిమాలో ఒక మధ్య తరగతి భర్తకు భార్యగా నటించిన అనన్య నగాళ్ల తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది.  అలా మల్లేశం సినిమాతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న అనన్య నగాళ్ల ఆ తర్వాత  ప్లే బ్యాక్ సినిమాలో కీలక పాత్రలో నటించింది.  ఈ సినిమాలో కూడా అనన్య నగాళ్ల తన నటనతో ప్రేక్షకులను అలరించింది.  ఇది ఇలా ఉంటే మల్లేశం , ప్లే బ్యాక్ సినిమాలతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను అలరించిన  అనన్య నగాళ్ల ఈ సినిమాల తర్వాత  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సబ్ సినిమాలో నటించింది.
  ఈ సినిమా కూడా ఈ ముద్దుగుమ్మ కు మంచి గుర్తింపు ను తీసుకుని వచ్చింది.  ఇది ఇలా ఉంటే సినిమాలలో చాలా డీసెంట్ గా కనిపిస్తూ,  ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న అనన్య నగాళ్ల  సోషల్ మీడియాలో మాత్రం కాస్త గ్లామర్ డోస్ ఎక్కువగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది.  ఇది ఇలా ఉంటే తాజాగా అనన్య నగాళ్ల తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది.  అనన్య నగాళ్ల తాజాగా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని,  అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  అనన్య నగాళ్ల  తాజాగా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన పిక్స్ ని చూసిన కొంత మంది నెటిజన్లు మ్యాజికల్ ఐస్ ,  బ్యూటిఫుల్ , లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: