వైరల్ ఫోటో: ఈ చిన్నారి ఇప్పుడు యూత్ ఫేవరేట్ హీరోయిన్.. గుర్తు పట్టారా..?

N.ANJI
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం అధికమైంది. కరోనా లాక్‌డౌన్ పీరియడ్‌లో చాలా మంది సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ ఖాళీ టైంలో చాలా మంది సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా అకౌంట్లల్లో తమ రోజువారీ ఈవెంట్స్, అలాగే వారి చిన్ననాటి ఫోటోలను తమ అభిమానులకు షేర్ చేసుకున్నారు. అలా ఆ టైంలో టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన చాలా మంది సెలబ్రిటీల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఒక హీరోయిన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక సినిమాతో ఒవర్ నైట్‌లో స్టార్ హీరోయిన్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? ఈ చిన్నారి ఎవరో తెలుసుకుందాం రండి.

త్రో బ్యాక్ పిక్చర్స్ ట్రెండ్ ద్వారా సెలబ్రిటీలు తమ చైల్డ్ హుడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పైన చూస్తున్న ఫోటోలో క్యూట్ క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఒక్క సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఆ సినిమాలో అబ్బాయిల్లో మంచి ఫాలొయింగ్ సంపాదించుకుంది. ఈ సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. చాలా మంచి సోషల్ మీడియా సెలబ్రిటీలు ఆ డైలాగ్స్‌ తో షార్ట్ వీడియోలు చేస్తున్నారు.


ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి మరెవరో కాదు.. ఇటీవల విడుదలైన ‘డీజే టిల్లు’ సినిమాలోని హీరోయిన్. సినిమాలో డీజే టిల్లుని ముప్పుతిప్పలు పెట్టించిన అందాల రాధిక. ఆమె పేరు నేహా శెట్టి. పూరి జగన్నాథ్ తనయుడు హీరోగా నటించిన ‘మెహబూబా’ సినిమా ద్వారా నేహా శెట్టి టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గల్లిరౌడీ సినిమాలో నటించారు. కానీ ఈ సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు. యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ సరసన డీజే టిల్లు సినిమాలో నటించారు. ఈ సినిమాతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. రాధికా అంటూ డీజే టిల్లు చెప్పే డైలాగ్స్ తెగ వైరల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: