రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుక్ ఖాన్..!

Pulgam Srinivas
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  గత మూడేళ్లుగా సినిమా లకు దూరంగా ఉన్న షారుక్ ఖాన్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలను ఒకే చేస్తూ వస్తున్నాడు.  ఇది ఇలా ఉంటే తాజాగా షారుక్ ఖాన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ను కూడా తాజాగా షారుక్ ఖాన్ వెల్లడి చేశాడు.  షారుక్ ఖాన్ బాలీవుడ్ క్రేజీ దర్శకుడు రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు.  ఈ విషయాన్ని స్వయంగా షారుక్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.  ఇది ఇలా ఉంటే షారుక్ ఖాన్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ మొదటి సారి నటిస్తున్నాడు.  రాజ్ కుమార్ హిరానీ సూపర్ హిట్ గా నిలిచిన మున్నాభాయ్ ఎంబీబీఎస్,  లగే రహో మున్నాభాయ్,  త్రీ ఇడియట్స్,  పీకే వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు.  ఈ సందర్భంగా డైరెక్టర్ రాజ్‌ కుమార్‌ హీరాని తో కలిసి ఓ ఆసక్తికర వీడియోను పంచుకుంటూ సినిమా టైటిల్‌ను కూడా రివీల్‌ చేశాడు.

షారుక్ ఖాన్ ఈ వీడియోలో మున్నా భాయ్‌ ఎంబీబీఎస్‌, పీకే మూవీ ల పోస్టర్ ల ఎదురుగా నిలబడి కనిపిస్తాడు.  ఆ తర్వాత రాజ్‌ కుమార్‌ హీరానీ తో తన కోసం  ఏదైనా కథ ఉందా అని అడగ్గా అవును... ఉంది అని సమాధానం ఇస్తాడు. దీనికి టైటిల్‌ ఏంటని అడగ్గా డంకీ అంటూ డైరెక్టర్ టైటిల్‌  చెప్పేశాడు. ఈ నేపథ్యం లో వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ నేపథ్యం లో షారుక్‌ సినిమా టైటిల్‌ ‘డంకీ’ అని, 2023 డిసెంబర్‌ 22 న ఈ మూవీ ని థియేటర్ లలోకి తీసుకురానున్నట్లు పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇలా షారుక్ ఖాన్ వరుస సినిమా లతో ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: