రూ.300తో బెంగళూర్‌కు వచ్చా.. కన్నడ స్టార్ హీరో ఎమోషనల్ వర్డ్స్..!

N.ANJI

కన్నడ స్టార్ హీరో యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘కేజీఎఫ్’ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్ హీరో యష్. కేజీఎఫ్ ఫస్ట్ చాప్టర్‌తో భారీ విజయాన్ని అందుకున్న యష్.. ఇటీవల ‘కేజీఎఫ్-2’ కూడా విడుదలై సంచలనం సృష్టించింది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుని రికార్డు స్థాయిలో డబ్బులు వసూళ్లు చేస్తోంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే కన్నడ ఇండస్ట్రీలో రాణించి.. స్టార్ హీరో హోదా సొంతం చేసుకున్న యష్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం యష్ స్టార్ హీరో అయినా.. ఒకప్పుడు సాధారణ జీవితాన్ని గడిపినట్లు ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదట్లో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. సినీ కెరీర్ ప్రారంభం తాను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.


సినిమాల్లో నటించేందుకు అవకాశాల కోసం కేవలం రూ.300 తీసుకుని బెంగళూరులో అడుగు పెట్టినట్లు యష్ గుర్తు చేసుకున్నారు. యష్.. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టినట్లు తెలిపారు. తన తండ్రి బస్ డ్రైవర్ అని, తల్లి గృహిణి అని పేర్కొన్నారు. సినిమాల్లో నటిస్తానని ఇంట్లో చెప్పినప్పుడు ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని అన్నారు. ఆ తర్వాత కండీషన్ పెట్టి.. పర్టికులర్ టైంలో సినీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవాలని, లేదంటే తాము చెప్పిన పనిలో చేరాలని పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. అప్పుడు యష్ తన తండ్రి నుంచి రూ.300 తీసుకుని బెంగుళూరు వచ్చినట్లు తెలిపారు.


ఈ విషయంపై యష్ స్వయంగా వెల్లడించారు. మూడు వందలు తీసుకుని బెంగళూరు చేరుకున్నట్లు, మొదట్లో సీరియల్స్ లో నటించినట్లు తెలిపారు. ఆ తర్వాత మెల్లిగా సినిమాల్లోకి అడుగు పెట్టినట్లు తెలిపారు. సీరియల్స్‌ లో తనకు మంచి పేరు వచ్చిందని, దాంతో సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చానని తెలిపారు. 2008లో ‘రాకీ’ సినిమాతో హీరోగా పరిచయం అయినట్లు ఆయన పేర్కొన్నారు. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగానని, ఈ విజయం అభిమానులు, ప్రేక్షకుల వల్లే సాధ్యమైనట్లు ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: