వీడియో: మరొకసారి డీజే టిల్లు అంటు రెచ్చిపోయిన లయ..!!

Divya
స్వయంవరం చిత్రంతో మొదటిసారిగా హీరోయిన్గా పేరు తెచ్చుకుంది అలనాటి హీరోయిన్ లయ. దీంతో ఎవరూ ఊహించని విధంగా స్టార్ హీరోయిన్ గా నిలిచింది. టాలీవుడ్ లో ఎన్నో మంచి చిత్రాలలో నటించిన లయ ఆ తర్వాత విభిన్నమైన పాత్రలో కూడా నటించి ప్రేక్షకులను బాగా మెప్పించింది.. ఇక రాను రాను ఆఫర్లు తగ్గడంతో వివాహం చేసుకోవడానికి సిద్ధమైంది. వివాహం చేసుకున్న లయ తన సినీ కెరీర్ కు గుడ్ బై చెప్పేసింది. ఆమె అభిమానులు మాత్రం తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుందేమో అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

లయ వివాహమైన తర్వాత అమెరికాకు వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. కొన్ని సినిమాల్లో ఆఫర్లు వచ్చినప్పటికీ ఆమె నటించేందుకు ఆసక్తి లేదని తేల్చి చెప్పినట్లు గా సమాచారం. అయితే గడిచిన రెండు సంవత్సరాల నుంచి లయ పూర్తిగా మారిపోయింది అని చెప్పవచ్చు. లయ సోషల్ మీడియాలో కూడా బాగా ఈ మధ్యకాలంలో సందడి చేస్తోంది. హీరోయిన్ గా సినిమాలో నటిస్తున్నప్పుడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు అభిమానులను కూడా సంపాదించుకుంది. ఇప్పుడు ఆ అభిమానులంతా ఈమె సోషల్ మీడియా ద్వారా బాగా ఫాలో అవుతున్నారు.
లయ సోషల్ మీడియాలో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.. ఈ మధ్యకాలంలో ట్రెండింగ్ సాంగ్ లను రిల్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. దీంతో కొందరు మాత్రం ఏమీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది అన్నట్లుగా వార్తలు వినిపించాయి. కొద్దిరోజుల కిందట సర్కార్ పాటలోని కళావతి పాటకు డాన్స్ వేయడం జరిగింది. ఈ డాన్స్ తో ప్రతి ఒక్కరిని కూడా బాగా అలరించింది లయ. అయితే ఇప్పుడు తాజాగా డీజే టిల్లు సినిమాలోని టైటిల్ సాంగ్కు డాన్స్ వేసి, అభిమానులను బాగా మెప్పించింది. తన స్నేహితులతో కలిసి ఆమె చేసిన డాన్స్ ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంటోంది. వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: