బరిలోకి దిగబోతున్న యాంగ్రీ యంగ్ మెన్..!!

Divya
యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ గరుడ వేగ చిత్రంతో మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా విజయం సాధించడంతో ఇతనిలో సరికొత్త జోష్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత అదే జోరుతో కల్కి చిత్రాన్ని నిర్మించగా ఆ చిత్రం కూడా విజయం సాధించింది. ప్రస్తుతం సరికొత్త పాత్రలో నటించాలని ఫిక్స్ అయిన రాజశేఖర్ తాజాగా శేఖర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం 2018వ సంవత్సరంలో మలయాళంలో జోసెఫ్ చిత్రం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది.

ఈ చిత్రానికి నిర్మాతగా రాజశేఖర్ శివాత్మిక, సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని జీవిత రాజశేఖర్ డైరెక్టర్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని కీలక పాత్రలో నటిస్తున్నది. ఇక వీరిద్దరూ నిజజీవితంలో కూడా తండ్రి కూతుర్ల గా ఉండడంతో ఈ సినిమాలో కూడా వీరిద్దరూ అలాగే నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజశేఖర్ గతంలో పవర్ ఫుల్ పోలీస్ స్టోరీస్ లకు పెట్టింది పేరుగా నిలిచారు. ఇక ఈ చిత్రం తనకి 91 వది.
ఈచిత్రంలో ఇప్పటివరకు విభిన్నమైన క్యారెక్టర్లో ఫోటోలు బయటకు విడుదల అవ్వడం జరిగింది. ఇక ఈ సినిమా పై రాజశేఖర్ తో పాటు జీవిత కూడా భారీ అంచనాలు పెట్టుకున్నది. ఈ చిత్రం మలయాళంలో కూడా మంచి విజయం సాధించడంతో ఈ సినిమాని తెలుగులో మార్పులు చేసి విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదలై మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఇటీవలే ఒక సాంగు ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇది కూడా బాగానే ఆకట్టుకున్నట్లూగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని మే 20వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: