అతి తక్కువ సమయంలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. విజయ్ దేవరకొండ తన కెరియర్ ను చిన్న చిన్న పాత్రల ద్వారా మొదలు పెట్టినప్పటికీ పెళ్లిచూపులు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో విజయ్ దేవరకొండ ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. పెళ్లి చూపులు మూవీ తరువాత విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఆ తర్వాత గీతా గోవిందం సినిమా తో విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కొనసాగుతున్న విజయ్ దేవరకొండ నుండి గత రెండు సంవత్సరాలుగా ఏ సినిమా రాలేదు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరో సారి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరో సినిమాలో నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ తాజాగా ఓ రికార్డ్ ను సృష్టించాడు. ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ను సాధించిన ఫాస్టెస్ట్ సౌత్ ఇండియా హీరోగా విజయ్ దేవరకొండ నిలిచాడు. ఇన్స్టాగ్రామ్ లో వేగంగా 15 మిలియన్ ల ఫాలోవర్ లను సాధించిన సౌత్ హీరోగా విజయ్ దేవరకొండ రికార్డ్ కెక్కాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో విజయ్ దేవరకొండ కంటే ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 18 మిలియనల్ ఫాలోవర్ లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 8.3 మిలియన్ లతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 8.1 మిలియన్ లతో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఉన్నారు. ప్రభాస్ , మహేష్ బాబు కంటే విజయ్ ముందుండటం విశేషం. దీంతో విజయ్ దేవరకొండ హీరో అభిమానులు పట్టరాని సంతోషంతో ఉన్నారు.