తలపతి విజయ్ కి తండ్రి గా స్టార్ హీరో..?

Anilkumar
తాజాగా స్టార్ హీరో విజయ్ మరియు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీపైడిపల్లి కాంబినేషన్లో ఒక సరి కొత్త సినిమా రానుందని మనందరికీ తెలిసిన విషయమే.ఇదిలావుండగా ఇటీవలే చెన్నైలో గ్రాండ్‌గా లాంఛ్ అయింది. అంతేకాదు విజయ్  66వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్టును దిల్ రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై నిర్మించడం జరిగింది.ఇకపోతే అఖండ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్టు ఇచ్చిన ఎస్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్.అయితే  ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ బయటకు వచ్చింది. ఇక అదేంటి అంటే ఈ చిత్రంలో విజయ్‌కు తండ్రిగా స్టార్ యాక్టర్ కనిపించబోతున్నాడట.

ఇకపోతే  తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన స్టార్ యాక్టర్ శరత్ కుమార్  ఈ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం వినిపిస్తోంది..అయితే దీనిపై అఫీషియల్ అప్‌డేట్ రావాల్సి ఉంది.ఇక  ఈ మూవీకి వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సోలోమన్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.ఇక ఇదిలావుండగా భారీ బడ్జెట్ సోషల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్‌లీడ్ రోల్ చేస్తోంది. అయితే ఊపిరి సినిమా తర్వాత వంశీపైడిపల్లి తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్న చిత్రమిదే కావడం విశేషం. అంతేకాకుండా ఈ ఇద్దరి కాంబోలో ఎలాంటి సినిమా రాబోతుందని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.

ఇక ఇదిలా ఉంటే విజయ్ తాజాగా బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 13న విడుదలైన ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్స్ కూడా రాబట్టింది తమిళంలో ఇప్పటికే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. తాజాగా తమిళంలో ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని మరోసారి అక్కడ తలపతి విజయ్ స్టామినా ఏంటో నిరూపించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా పర్వాలేదనిపించింది.కాగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: