"కేజీఎఫ్ పార్ట్ 3" లో యశ్ తో ప్రభాస్... ?

VAMSI
ఆర్ ఆర్ ఆర్ మూవీ తరహాలో మరో మల్టీ స్టారర్ మూవీ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇంతకీ కథ ఏమిటి... ?హీరోలు ఎవరు అంటే.. ? టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ మరియు కేజీఎఫ్ హీరో యశ్ అని సమాచారం. వీరిద్దరి కాంబో లో మూవీ రాబోతుంది అని ప్రస్తుతం వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ అంచనాలు లేకుండా రిలీజ్ అయిన కన్నడ ఫిల్మ్ కేజీఎఫ్ ఎంత పెద్ద విజయాన్ని సాధించింధో అందరికీ తెలిసిందే. దీంతో ఒక్క సారిగా హీరో యశ్ కి పాన్ ఇండియా హీరో క్రేజ్ వచ్చింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో కేజీఎఫ్ చాప్టర్ 2 కి భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుకున్న విధంగానే రిలీజ్ అయిన ఈ సీక్వెల్ కి కూడా మంచి ఆదరణ లభిస్తోంది.
నేడు ఎంతో ఘనంగా రిలీజ్ అయిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో హిట్ టాక్ ను అందుకుని అలరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇపుడు కేజీఎఫ్ 3 పై చర్చ మొదలయింది. కేజీఎఫ్ చాప్టర్ 2 లో చాప్టర్ 3 ఉండబోతుందని హింట్ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ నీల్. సినిమా క్లైమాక్స్ లో రాఖీ బాయ్ షిప్ లో వెళుతోంటే అతనిని అమెరికా మరియు ఇండోనేషియా అధికారులు ఛేజ్ చేస్తారు. అయితే ఈ ఒక్క సన్నివేశంతో పార్ట్ 3 కూడా ఖచ్చితంగా ఉండబోతోంది. అయితే ఈ సారి అంతర్జాతీయంగా రాఖీ బాయ్ సత్తా చూపించనున్నాడు అని తెలుస్తోంది. మరి ఈ సినిమా
దాంతో ఇపుడు చాప్టర్ 3 పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఈ సినిమాకి సంబంధించి ఒక సెన్సేషనల్ న్యూస్ వినిపిస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 3 లో హీరో యశ్ తో పాటు ప్రభాస్ కూడా నటించబోతున్నారు అని ఇండస్ట్రీ నుండి టాక్ వినపడుతోంది. వీరిద్దరూ కలిసి అమెరికాలో తమ సామ్రాజ్యాన్ని విస్తరింపచేస్తారని తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన వార్త త్వరలోనే వస్తుందేమో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: