త్రిబుల్ ఆర్ అంటే.. అది గ్రేట్ సినిమా : RGV

praveen
రామ్ గోపాల్ వర్మ నోటి నుంచి ఎప్పుడు ఎలాంటి మాట వస్తుందో ఎవరికీ ఊహకందని విధంగానే ఉంటుంది. నా జీవితం నా ఇష్టం నువ్వు ఎవరు సలహాలు ఇవ్వడానికి అంటూ ప్రతి ఒక్కరికి ఎదురు చెబుతూనే ఉంటారు రామ్ గోపాల్ వర్మ. నాకు పెళ్లి అనే కాన్సెప్ట్ మీద నమ్మకం లేదు జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అంటూ యువతకు బాగా నచ్చే మాటలు చెబుతూ ఉంటారు. ఇక అదే సమయంలో చేయబోయే సినిమాలను ప్రకటిస్తూ సెన్సేషన్ గా మారి పోతూ ఉంటారు. వర్మ తీసిన సినిమాలు కాంట్రవర్సీ అవుతాయో లేకపోతే కాంట్రవర్సీ అయ్యే సినిమాలనే వర్మ తీస్తాడో అర్థం కాదు కానీ ఇక వర్మ సినిమాలు మాత్రం సెన్సేషన్ సృష్టిస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అయితే వర్మ ఏదైనా సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడాడు అంటే అది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాంటి రామ్ గోపాల్ వర్మ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా గురించి మాట్లాడాడు. త్రిబుల్ ఆర్ సినిమా రాజమౌళి తెరకెక్కించిన ఒక అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించాడు. త్రిబుల్ ఆర్ బాగాలేదు అని ఎవరైనా అంటే వారిపై విమర్శలు కూడా చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇలా త్రిబుల్ ఆర్ సినిమా గురించి పాజిటివ్గా మాట్లాడటంతో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు.

 ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా కంటే మరో సినిమా చాలా గొప్పది అంటూ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దాదాపు వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది త్రిబుల్ ఆర్.  త్రిబుల్ ఆర్ సినిమా తో పోల్చి చూస్తే ది కాశ్మీర్ పైల్స్ బెస్ట్ సినిమా అని చెప్పుకొచ్చాడు. 10 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ది కాశ్మీరు ఫైల్స్ సినిమా విజయమే దీనికి ఎగ్జాంపుల్ అంటూ తెలిపాడు. ఇక నిజమైన గేమ్ చేంజర్ సినిమా అంటు అభిప్రాయం వ్యక్తం చేశాడు. త్రిబుల్ ఆర్  భారీ బడ్జెట్తో నిర్మించారు. అది హిట్ అవ్వడం కామన్. కానీ కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమా ఎంతో మంది నిర్మాతల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rg

సంబంధిత వార్తలు: