సెర్బియాలో అల్లు అర్జున్ బర్త్ డే సెలెబ్రేషన్స్ అదరహో?

VAMSI
అల్లు అర్జున్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. గంగోత్రి సినిమాతో సాధారణ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడో పెద్ద ఐకాన్ స్టార్ గా ఎదిగి ప్రేక్షుల మధిని దోచుకున్నాడు. ఇలా చూస్తుండగానే మన అభిమాన హీరో కి అపుడే నలభై ఏళ్లు వచ్చేశాయి. వయసు నాలుగు పదులు దాటింది కానీ ఇప్పటికీ టక్ చేసి.. కాస్త క్రాప్ అలా స్టైల్ గా కట్ చేస్తే  యమ స్టైలిష్ గా కాలేజీ కుర్రాడిలా సూపర్ గా ఉంటారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే అన్న విషయం తెలిసిందే. బన్నీ బర్త్ డే అంటే అభిమానులకు పండగ కంటే స్పెషల్ అని ప్రత్యేకంగా చెప్పాలా.. అభిమానులు, సినీ ప్రముఖులు,సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా బన్నీ కి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
ఇక అల్లు అర్జున్ తన 40వ జన్మదిన వేడుకలను చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేసి... దూం దాం గా జరుపుతున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ హీరో  పుట్టినరోజుకి కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఇక అల్లు అర్జున్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఏర్పాట్లు అయితే మామూలుగా లేవు. బన్నీ తన 40వ జన్మదిన వేడుకల్ని ప్రత్యేకంగా జరపడానికి ఈ సెలబ్రేషన్ నీ సెర్బియా ఏర్పాటు చేశారు. పుట్టినరోజు వేడుకలు కోసం  బన్నీ తన కుటుంబ సభ్యులతో సహా మరో 50 మంది సన్నిహితులతో కలసి సెర్బియా వెళ్ళారు. అక్కడ బర్త్ డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరిగాయి.సెర్బియా రాజధాని బెల్గ్రేడ్ లో బన్నీ తన వారితో కలసి ఫుల్ గా పార్టీలో మునిగి తేలుతున్నారు.


అయితే ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబందించిన ఫొటోస్ కొన్ని సోషల్ మీడియాలో హాలచల్ చేస్తున్నాయి. ఆ ఫొటోస్ లో బన్నీ పక్కనే ఆయన సతీమణి స్నేహ రెడ్డి కూడా ఉన్నారు. ఆమె చాలా స్టైలిష్ గా పార్టీ  వెర్ డ్రెస్ లో అందరి దృష్టిని ఆకర్షించేలా చాలా స్పెషల్ గా కనిపిస్తున్నారు. భర్త పక్కనే నిలబడి బర్త్ డే నీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ సంతోషంగా ఉన్నారు. వీరి జంట కనుల పండుగగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: