వర్మ: డేంజరస్ 2.o అంటూ మరొక సంచలన ట్వీట్..!!

Divya
డైరెక్టర్ ఆర్జివి ఎలాంటి వ్యక్తో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. సమస్య ఏదైనా సరే తనదైన శైలిలో స్పందిస్తూ నిరంతరం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఆర్జివి. ఇక ఆయన సినిమాల గురించి కూడా ఈ మధ్యకాలంలో ఎలా ఉంటాయో మనం చెప్పనవసరం లేదు.. వర్మ అంటే చాలు కాంట్రవర్సీ కి పేరుగా పడిపోయింది. ఇక ట్విట్టర్లో వర్మ చేసే హల్చల్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. వర్మ ఏ సమయంలో ఎలాంటి పోస్టులు పెడతారో.. ఎవరు ఊహించలేరు. కేవలం తనకు నచ్చినది చేయడం వంటివి జరుగుతూ ఉంటుంది. ఇక తన మనసులోని మాటను ఖచ్చితంగా బయట పెట్టడం లో ఎలాంటి మొహమాట పడుడు వర్మ.

ఇక వర్మ చేసిన కొన్ని పోస్టులు , వీడియోస్ కానీ క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి. వర్మ ఏదైనా విషయాన్ని తనదైన లెవల్లో ఇష్యూ అయ్యేలా చేయడంలో ఆర్జివికే సాధ్యం అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా మరొకటి తో పెద్ద హాట్ టాపిక్ అయ్యేలా చేశాడు వర్మ. అదేమిటంటే వర్మ నిర్మించిన డేంజరస్.. చిత్రాన్ని షాక్ ఇచ్చేలా చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ 8 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో విడుదల చేయడానికి ప్రకటించారు వర్మ.

అయితే ఇలా ప్రకటించడంతో ఇప్పుడు ఊహించని పరిణామం ఎదురైంది ఈ మూవీని ప్రదర్శించేందుకు PVR, ఐమాక్స్ థియేటర్స్ ను సుప్రీంకోర్టు వ్యతిరేకించిలా ఉందంటూ మరికొంతమంది కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా వర్మ మరొకసారి ఈ ఇష్యూని చాలా హైలెట్గా చేస్తూ తనదైన శైలిలో..RRR సినిమాకు సంబంధించి ప్రమోషన్  చేస్తూ ఒక వీడియో ని షేర్ చేయడం జరిగింది ఆర్జీవి. ప్రస్తుతం ఈ వీడియో నెట్ ఇంకా చాలా వైరల్ గా మారుతుంది. ఈ వీడియో పోస్ట్ చేయడంతో రకరకాలుగా నెటిజెన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: