మహాభారతం పై మనసుపడ్డ బాలీవుడ్ స్టార్ హీరో.. రిజెక్ట్ చేసిన రాజమౌళి.. ?

Anilkumar
ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందం సినిమా మంచి సక్సెస్ సాధించడంతో ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేసే పనిలో పడ్డారు.ఇకపోతే ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల గ్రాస్ దాటి 1000 కోట్ల వైపు పరుగులు తీస్తోంది.అంతేకాదు బాక్సాఫీస్ వద్ద ఊహించని రికార్డులు క్రియేట్ చేస్తోంది.ఇక  ప్రస్తుతం రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నారు.అయితే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించారు. ఇక రాజమౌళి ఏకంగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ క్రేజీ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చారు.కాగా  బాహుబలి అఖండ విజయం సాధించిన తర్వాత అమీర్ ఖాన్ విజయేంద్ర ప్రసాద్ ని సంప్రదించారట.ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో మహాభారతం చిత్రంలో నటించాలనేది అమీర్ ఖాన్ కోరిక.

ఇక  దీనికోసం మహా భారతం స్క్రిప్ట్ సిద్ధం చేసి ఇవ్వాలని అమీర్ ఖాన్ విజయేంద్ర ప్రసాద్ ని రిక్వస్ట్ చేశారట. అయితే దీనితో విజయేంద్ర ప్రసాద్ అమీర్ ఖాన్ కి బదులిస్తూ.. మహా భారతం అంటే కనీసం 5, 6 భాగాలు ఉంటుంది.అంతేకాదు  అంత పెద్ద స్క్రిప్ట్ రాసే టైం నాకు లేదు. ఇక వేరే కమిట్మెంట్స్ వల్ల అంత సమయం కేటాయించలేను. అయితే కానీ కథ అవుట్ లైన్.. ఏ పార్ట్ ఎక్కడి వరకు ఉండాలి ఇలా ప్లాన్ సిద్ధం చేసి మాత్రం ఇవ్వగలను. ఇకపోతే పూర్తి స్క్రిప్ట్ ని వేరేవాళ్లతో రాయించుకోవాలని అమీర్ కు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.ఇక అమీర్ ఖాన్ కి మహా భారతంపై మక్కువ ఎక్కువ. కాగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాలని స్వయంగా అమీర్.. రాజమౌళిని కోరారట.

అయితే దీనితో రాజమౌళి కూడా అమీర్ ఖాన్ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారు. ఇకపోతే మహా భారతం నా డ్రీం ప్రాజెక్ట్. ఇక ఆ చిత్రం తెరకెక్కించే సామర్థ్యం పొందడానికి నాకు ఇంకా టైం పడుతుంది.అంతేకాదు  అలాగే ప్రస్తుతం తనకున్న కమిట్మెంట్స్ వల్ల ఇంకా టైం పడుతుందని రాజమౌళి అమీర్ ఖాన్ కు చెప్పినట్లు విజయేంద్ర ప్రసాద్ రివీల్ చేశారు.ఇదిలావుండగా అమీర్ ఖాన్ కి రాజమౌళి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. అయితే మగధీర చిత్రం నుంచి రాజమౌళి సినిమాలని ఫాలో అవుతున్నట్లు అమీర్ ఖాన్ గతంలో తెలిపారు. ఇకపోతే అమీర్ ఖాన్ ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రచారం కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: