మరో సినిమాను మొదలుపెట్టిన నాగశౌర్య..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం వరుస సినిమా లతో ఫుల్ బిజీగా ఉన్నాడు,  నాగ శౌర్య టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఛలో సినిమా తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నాడు.  ఆ తర్వాత ఛలో లాంటి విజయం కోసం నాగ శౌర్య వరు సపెట్టి మూవీ లలో నటిస్తున్నప్పటికీ ఆ రేంజ్ విజయం మాత్రం ఇప్పటి వరకు నాగ శౌర్య కు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు,  కొంత కాలం క్రితం నాగ శౌర్య , రీతూ వర్మ హీరోయిన్ గా  తెరకెక్కిన వరుడు కావలెను మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బోల్తా కొట్టింది,  వరుడు కావలెను సినిమా తర్వాత అతి తక్కువ కాలం లోనే నాగ శౌర్య 'లక్ష్య' మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు,  కేతికా శర్మ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది,  స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన లక్ష్య సినిమా కూడా నాగ శౌర్య కు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందించలేకపోయింది.

 ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ శౌర్య  'కృష్ణ వ్రింద విహారి'  అనే మూవీ లో నటిస్తున్నాడు,  ఈ మూవీ కి అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో షెర్లీ సెటియా హీరోయిన్ గా నటిస్తోంది,  ఈ మూవీ ని ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే నాగ శౌర్య మరో సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు,  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎస్ ఎల్  వి సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం 6 గా సుధాకర్ చెరుకూరి నిర్మించబోయే కొత్త సినిమాని నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి తో చేయ‌నున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: