కళ్యాణ్ రామ్ 'బింబిసార' విడుదల తేది వచ్చేసింది..!

Pulgam Srinivas
టాలీవుడ్ హీరో కల్యాణ్ రామ్,  స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అతనొక్కడే మూవీ తో మంచి మాస్ కమర్షియల్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు,  అతనొక్కడే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న కళ్యాణ్ రామ్  ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ విషయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేకపోయాడు.  ఇది ఇలా ఉంటే కళ్యాణ్ రామ్ కొంత కాలం  క్రితం విడుదల అయిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 118 తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు,  ఇది ఇలా ఉంటే 118 సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ 'ఎంత మంచి వాడవురా'  సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు,  ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన మెహరిన్ హీరోయిన్ గా నటించింది.
 

 ఇది ఇలా ఉంటే కళ్యాణ్ రామ్ ప్రస్తుతం బింబిసార అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు,  బింబిసార మూవీ ని ని కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు.  బింబిసార మూవీ కథ గతంలోనూ,  వర్తమానంలోనే నడుస్తూ ఉండబోతున్నట్లు తెలుస్తోంది,  అందువలన బింబిసార  మూవీ లో కళ్యాణ్ రామ్  రాజు గాను అలాగే మోడ్రన్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న బింబిసార మూవీ కి వశిస్ట్  దర్శకత్వం వహిస్తున్నాడు,  ఇది ఇలా ఉంటే తాజా గా బింబిసార చిత్ర బృందం ఈ మూవీ  విడుదల తేదీ ని అధికారికంగా ప్రకటించింది. బింబిసార మూవీ ని  ప్రపంచ వ్యాప్తంగా 5 ఆగస్టు 2022 న విడుదల చేయబోతున్నట్లు తాజా గా చిత్ర బృందం అఫీషియల్  గా ప్రకటించింది,  ఇది ఇలా ఉంటే బింబిసార మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: