ఆర్జీవీ డైరెక్టర్ గా "కేసీఆర్ బయోపిక్"... ఇది న్యూస్ అంటే !

VAMSI
తెలంగాణ రాజకీయాల్లో కొన్ని సంవత్సరాలుగా కీలక పాత్ర పోషించి... నేడు సీఎంగా తెలంగాణ ప్రజలను పాలిస్తున్న వ్యక్తి కేసీఆర్. ఈయన చేసిన ఉద్యమాల కారణంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందని అక్కడ ప్రజలు బలంగా నమ్ముతారు. అందుకే ఇప్పటికే రెండు సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కేసీఆర్ నాయకత్వంలోని తెరాస పార్టీని గెలిపించి తమ ఆశీర్వాదాన్ని ఇచ్చారు. కేసీఆర్ సీఎంగా ఉన్న ఈ ఎనిమిది సంవత్సరాలలో ప్రజలు తన పై పెట్టుకున్న నామాన్ని వమ్ము చేయకుండా సుపరిపాలన సాగిస్తూ వచ్చారు. ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ఎన్నో మంచి మంచి పధకాలను తీసుకొచ్చి ప్రజలకు అండదండగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఒక వెలుగు వెలుగుతున్నారు.
అందుకే ఇతని జీవిత చరిత్రను సినిమా తీయాలని మాట గట్టిగా వినబడుతోంది. అయితే చాలా కాలం నుండి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా ఖచ్చితమయిన సమాచారం అయితే లేదు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం త్వరలోనే కేసీఆర్ బయోపిక్ కార్యరూపం దాల్చబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ విషయంపై సంచలన ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.  తాజాగా డేంజరస్ మూవీ ప్రమోషన్ లో ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. త్వరలోనే కేసీఆర్ బయోపిక్ తీస్తానని ప్రస్తుతానికి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని చెప్పాడు.
మరి కేసీఆర్ బయోపిక్ రామ్ గోపాల్ వర్మ చేతుల్లో పడితే ఇంకేమైనా ఉందా? మరి ఏ విధంగా ఉంటుంది అనేది తెలియాలంటే ఇంకొంతకాలం వరకు ఆగాల్సిందే. కాగా ఆర్జీవీ తెరకెక్కించిన డేంజరస్ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఇందులో అప్సర రాణి మరియు నైనా గంగూలీలు లెస్బియన్ లు గా నటిస్తున్నారు. ఒక అందమైన లెస్బియన్ థ్రిల్లర్ గా రాబోతోంది. ఇప్పటికే విడుదల అయినా పోస్టర్ మరియు ట్రైలర్ దేశ వ్యాప్తంగా హల్ చల్ చేస్తున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: