'ఆర్ ఆర్ ఆర్' లో ఎన్టీఆర్ కి నచ్చిన సీన్ ఇదే..!

Anilkumar
ఇండియన్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మొదటి రోజు నుంచే ఈ సినిమా బ్లాక్బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్స్ రావడంతో సినిమాలో నటించిన చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ  బాలీవుడ్ ఇండ్రస్టీ లో భారీ గుర్తింపు కూడా కూడా లభించింది. ఇక సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి కూడా అదే తరహాలో సినిమా మొత్తం మీద ఎక్కువగా ఆకట్టుకున్న సన్నివేశం ఒకటి ఉందట. అంతే కాదు ఆ సన్నివేశం కోసం చాలా కష్టపడినట్లు కూడా ఎన్టీఆర్ వివరణ ఇచ్చాడు. కొమరం భీమూడో పాటలోని కొన్ని సన్నివేశాలు ఎన్టీఆర్ కి చాలా చాలెంజింగ్ గా అనిపించాయట. ఆ పాటలో నటించడం అంత సాధారణమైన పని కాదని కూడా ఎన్టీఆర్ తెలియజేశాడు. ఆ పాటలో చాలా రకాల భావోద్వేగాలను చూపించాల్సి వచ్చింది అని..ఒక వైపు స్నేహితుడు మోసం చేశాడు అనే బాధ అలాగే అమాయకత్వం.. మరోవైపు అడవి బిడ్డల ధైర్యం ఇలా చాలా రకాల ఎమోషన్స్ చూపించాల్సి ఉంటుంది.

కాబట్టి ఖచ్చితంగా హార్డ్వర్క్ చేయాల్సి వచ్చిందని జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అంతేకాదు సినిమాలో  తనకు ఆ పాట ఎక్కువగా నచ్చినట్లు కూడా చెప్పుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్ కే కాదు కొమురం భీమూడో పాటతో పాటు ఆ పాటలో ఎన్టీఆర్ నటనకు యావత్ సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ని అందుకని సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాతో రాజమౌళి  కలెక్షన్స్ పరంగా తన రికార్డులను తానే బ్రేక్ చేయడం గమనార్హం. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎలాంటి వస్తువులను అందుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: