డబుల్ హ్యాట్రిక్ తో సరికొత్త రికార్డ్ సాధించిన ఎన్టీఆర్..!

Anilkumar
ప్రస్తుతం ఈ జనరేషన్ హీరోల్లో వరుసగా సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేయడమే కష్టం గా ఉంది.అయితే  అలాంటిది రిలీజ్ అయిన ప్రతి సినిమా హిట్ అవ్వాలి అంటే  మరీ కష్టం.ఇకపోతే  ఒక స్టార్ హీరో హ్యాట్రిక్ కొట్టాడు అంటే రికార్డు సాధించినట్లే. ఇకపోతే గతంలో స్టార్ హీరోలు వరుస హిట్లు సాధించిన రికార్డులు చాలా ఉన్నాయి. అయితే కానీ ....ఈ జనరేషన్ హీరోలలో వరుసగా సినిమా మీద సినిమా హిట్ సాధించడం అంటే కాస్త కష్టమే. కాగా ఎన్టీఆర్ వరుసగా రెండు సార్లు హ్యాట్రిక్ కొట్టి డబల్ హ్యాట్రిక్ తో సరికొత్త రికార్డు సాధించాడు.అయితే ఒకప్పుడు ఎన్టీఆర్ కూడా వరుసగా ప్లాప్స్ ని ఎదుర్కున్నాడు.

ఆయన తనని తాను మార్చుకొని తన కథల్లోనూ, నటనలోనూ, బాడీ లోను మరింత వైవిధ్యాన్ని తీసుకొచ్చి కొత్త కొత్త సినిమాలతో ప్రేక్షకులు, అభిమానుల ముందుకొచ్చి హిట్స్ సాధిస్తున్నాడు. అయితే టెంపర్ సినిమా ముందు ఎన్టీఆర్ పై అనేక విమర్శలు వచ్చాయి, ప్లాప్స్ ఉన్నాయి. ఇకపోతే వాటన్నిటిని ఎదుర్కొని వరుసగా టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఇక ఆ తర్వాత జై లవ కుశ, అరవిందసమేత వీరరాఘవ, ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో మరోసారి హ్యాట్రిక్ హిట్ కొట్టాడు.ఈయన వరుసగా ఆరు సినిమాలు హిట్ మీద హిట్ కొట్టి  డబల్ హ్యాట్రిక్ హిట్స్ తో సరికొత్త రికార్డుని సాధించాడు.

ఇకపోతే ఇదే విజయాలు కొనసాగాలని తన తర్వాతి సినిమాలని కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్.అయితే  రాజమౌళి సినిమా తర్వాత హీరోలకి కచ్చితంగా ప్లాప్ పడుతుంది అని అందరూ అంటారు. ఇక గతంలో ఎన్టీఆర్ కి కూడా ఇలాగే జరిగింది. కాగా ఈ సారి మాత్రం అలా జగకూడదు అని వరుసగా హిట్స్ ఉన్న కొరటాల శివతో సినిమాని ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొరటాల శివతో సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్.అయితే  అందులోను ఇది ఎన్టీఆర్ 30వ చిత్రం కావడంతో మరింత స్పెషల్ గా తీసుకొని ఎలాగైనా ఈ సారి కూడా విజయం సాధించాలని ఫిక్స్ అయ్యాడు. ఇకపోతే ఆ తర్వాత కూడా త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు లాంటి సక్సెస్ డైరెక్టర్స్ నే లైన్ లో పెట్టుకున్నాడు ఎన్టీఆర్...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: