పొట్టి డ్రెస్ లో అందాలు ఆరబోస్తున్న అనన్య నగాళ్ల..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ అనన్య నగాళ్ల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటించింది తక్కువ సినిమాలే అయినా కావాల్సినంత క్రేజ్ ను మాత్రం  టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకుంది. అందాల ముద్దుగుమ్మ అనన్య నగాళ్ల టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మల్లేశం మూవీ తో ఎంట్రీ ఇచ్చింది,  ఈ మూవీ అటు ప్రేక్షకుల నుండి ఇటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు పొందడం మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని సాధించింది.
 

 ఇది ఇలా ఉంటే మల్లేశం సినిమాలో తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న అనన్య నగాళ్ల కు ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు దక్కాయి,  అనన్య నగాళ్ల అందులో భాగంగా ప్లే బ్యాక్ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకిల్ సబ్  సినిమాలో అనన్య నగాళ్ల  ఒక ముఖ్యమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది,  వకిల్ సబ్ మూవీ లో అనన్య నగాళ్ల ది చిన్న పాత్రే అయినప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమా ద్వారా క్రేజ్ మాత్రం బాగానే వచ్చింది.  ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలను అరబోయకుండా సంప్రదాయబద్దంగా ఉంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలను ఆరబోయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు,  అందులో భాగంగా తాజాగా అనన్య నగాళ్ల తన ఇన్ స్టా లో కొన్ని హాట్ పిక్స్ ని పోస్ట్ చేసింది.  తాజాగా అనన్య నగాళ్ల తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన పిక్స్ లో పింక్ కలర్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకిని, ఆ డ్రెస్ పై బ్లాక్ కలర్ కోట్ ను వేసుకొని అదిరిపోయే హాట్ లుక్ లో పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది,  అనన్య నగాళ్ల తాజాగా ఇన్ స్టా లో పోస్ట్ చేసిన హాట్ పిక్స్ ని చూసిన కొంత మంది నెటిజన్లు గార్జియస్ ,  స్టన్నర్ ,  లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: