ప్లాప్ టాక్ తో 100 రోజులు ఆడిన ప్రభాస్ సినిమా..?

Anilkumar
 ప్రభాస్ గురించి చెప్పుకోవాలి అంటే 'బాహుబలి' కి ముందు 'బాహుబలి' కి తర్వాత అని అంటూ ఉంటారు.అయితే హిట్ సినిమాల వలనే ప్రభాస్ కు స్టార్ ఇమేజ్ వచ్చింది అనడం మాత్రం అతిశయోక్తి అవుతుంది. ఇకపోతే ప్లాప్ సినిమాలతో కూడా అతను కొన్ని రేర్ రికార్డులు క్రియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాగా 'ఈశ్వర్' తో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ చిత్రంతో యావరేజ్ ఫలితాన్నే అందుకున్నాడు.ఇక ఆ తర్వాత వచ్చిన 'రాఘవేంద్ర' అయితే ప్లాప్ అయ్యింది .కానీ ఆ మూవీ 3, 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడిందని బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. అయితే ఆ తర్వాత వచ్చిన 'వర్షం' బ్లాక్ బస్టర్ అయ్యింది.

దాని అనంతరం  'అడవి రాముడు' 'యోగి' వంటి చిత్రాలు నిరాశపరిచినా అవి కూడా కొన్ని కేంద్రాల్లో 100 రోజులు ఆడాయి.ఇకపోతే  'మున్నా' అనే చిత్రం ప్లాప్ టాక్ ను మూటకట్టుకున్నప్పటికీ ఏకంగా 9 కేంద్రాల్లో 100 రోజులు ఆడడం జరిగింది.అయితే తాజాగా ఈ విషయాన్ని  దిల్ రాజు ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.అయితే సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఆయన బ్యానర్ కు బ్రేక్ వేసింది 'మున్నా' మూవీ. ఇకపోతే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజుతోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది.కాగా  ఈ విషయాన్ని దిల్ రాజు నేరుగా ప్రభాస్ కు తెలిపారట.

ఇక  ఆ టైంకి ప్రభాస్ అండ్ ఫ్రెండ్స్ కలిసి పార్టీ చేసుకుంటున్నారు.అయితే తాను వెళ్ళి 'నీకు హిట్ ఇవ్వలేకపోయాను సారి' అని చెప్పేసరికి ప్రభాస్ అండ్ ఫ్రెండ్స్ హర్ట్ అయినట్టు దిల్ రాజు చెప్పడం జరిగింది.ఇకపోతే  ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ ఆ మూవీ 9 కేంద్రాల్లో 100 రోజులు ఆడిందని కూడా దిల్ రాజు ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఇక ఇదిలా ఉంటే ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. ఈ సినిమా డార్లింగ్ ఫాన్స్ నిరాశపరిచింది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలపై భారీ ఆశలు పెట్టుకున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: