ఆర్ఆర్ఆర్ : భారీ వసూళ్లు రావడం కష్టమే?

Purushottham Vinay
తెలుగు రాష్ట్రాల్లో rrr సినిమా టికెట్ రేట్లు పెంచుకోడానికి ప్రభుత్వాలు అవకాశం కల్పించాయి కాబట్టి.. ఫస్ట్ డే కొంచెం అటు ఇటుగా ఒక యాభై కోట్లు అయిన కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.యూఎస్ లో అయితే 2.5 మిలియన్ల డాలర్లకు పైగా ప్రీ సేల్స్ రావడాన్ని బట్టి చూస్తే.. ఇక ఓవర్ సీస్ లో బీభత్సమైన కలెక్షన్ వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు పెట్టాలంటే నార్త్ మార్కెట్ చాలా ముఖ్యమనే చెప్పాలి.ఇక ఈ నేపథ్యంలో ఆర్.ఆర్.ఆర్ టీమ్ ఉత్తరాదిలో ప్రమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ముంబై నగరంలో స్పెషల్ ఈవెంట్ చేయడంతో పాటుగా ఢిల్లీ - అమృత్ సర్ - బరోడా - వారణాసి - జైపూర్ - కోల్ కటా వంటి ప్రధాన నగరాల్లో కూడా పర్యటించి వచ్చారు.దీంతో నార్త్ మార్కెట్ నుండి ఫస్ట్ డే వసూళ్లు 20 నుండి 25 కోట్లు ఆశిస్తున్నారు. అయితే హిందీలో మాత్రం 'రాధే శ్యామ్' మాదిరిగానే ఆర్.ఆర్.ఆర్ ప్రీ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఇక అక్కడక్కడ తెలుగు వెర్షన్ ప్రదర్శించే థియేటర్లు ఫుల్ అవుతున్నాయి కానీ.. హిందీ బుకింగ్స్ మాత్రం అంత ఆశాజనకంగా లేవు.


ఇక 'బాహుబలి' సినిమా తర్వాత యస్ యస్ రాజమౌళి నుంచి వస్తోన్న సినిమా కావడంతో..రాజమౌళి క్రేజ్ తో అన్ని షోలు అడ్వాన్స్ గా హౌస్ ఫుల్ అవుతాయని అందరూ కూడా భావించారు. అయితే సినిమా టీం మాత్రం ఇలా వరుస ప్రమోషన్స్ తో సోషల్ మీడియాలో మాత్రం హడావిడిగా కనిపిస్తోంది కానీ.. ఆ స్థాయిలో మాత్రం టికెట్స్ అమ్ముడుపోకపోవడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి రిలీజ్ కు ముందు రోజైనా ఈ సినిమా బుకింగ్స్ పెరుగుతాయేమో అనేది ఇక చూడాలి.ఇక ఏది ఏమైనప్పటికీ ఉత్తరాది మార్కెట్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా తొలిరోజు 8 నుంచి 10 కోట్లు రాబట్టవచ్చని బాలీవుడ్ ట్రేడ్ నిపుణులు బాగా అంచనా వేస్తున్నారు. టాక్  కనుక బాగుంటే రెండో రోజు నుంచి వసూళ్లు మరింతగా పుంజుకునే అవకాశం ఉంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: