బాయ్ ఫ్రెండ్ తో షారుఖ్ ఖాన్ కూతురు... వైరల్ అయిన ఫోటోలు ?

VAMSI
ఇండస్ట్రీలో ఉన్న బడా నటీనటులు కానీ నిర్మాతలు కానీ బయట ఎక్కడైనా కనబడ్డారు అంటే ఇక పబ్లిక్ కావొచ్చు లేదా మీడియా కావొచ్చు ఏదో ఒక విధంగా వార్తలు క్రియేట్ చేసి వైరల్ చేస్తుంటారు. అయితే వీరు ఇలా రాసే వార్తలో కొన్ని వాస్తవాలు ఉన్నప్పటికీ, చాలా వరకు అవాస్తవాలు ఉంటాయన్నది తెలిసిన విషయమే. ముఖ్యంగా హీరో హీరోయిన్ అలా బయట కనబడితే చాలు, ఇక వారిద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు పుట్టిస్తారు. అయితే తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగి ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఇది హీరో లేదా హీరోయిన్ విషయం కాదు. బాలీవుడ్ లో బడా హీరో మరియు నిర్మాత అయిన షారుఖ్ ఖాన్ కూతురు గురించిన వార్త.
షారుఖ్ కుమార్తె సుహాన ఖాన్ తన స్నేహితుడితో కలిసి అలా బయటకు వెళ్లడంతో అనుకోకుండా కెమెరా కంట పడింది. దానితో దొరికిందే అవకాశం అని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేసేస్తున్నారు. ఇంకేముంది బాలీవుడ్ మీడియా లో ఈ న్యూస్ క్షణాల్లో వైరల్ గా మారింది.  అయితే ఆ క్లిక్స్ గమనించిన సుహానా ఆమె స్నేహితుడు ఫేస్ లు కనపడకుండా కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ పిక్స్ ప్రస్తుతం బాలీవుడ్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ షారుక్ తనయురాలు సుహానాతో ఉన్న ఆ యువకుడు ఎవరు అంటూ ఆరాలు తీస్తున్నారు నెటిజన్లు. అయితే బాయ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చని మీడియా వర్గాలు భావిస్తున్నాయి.
వీరి మధ్య రిలేషన్ ఏమిటి ? ఎందుకు ముఖాలు కనపడకుండా దాచుకోవడానికి ప్రయత్నించారు అంటూ ఊహాగానాలు వెల్లు వెత్తుతున్నాయి. మరి ఈ విషయం గురించి షారుఖ్ ఖాన్ కు ముందే తెలుసా ? లేదా అన్న విషయాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: