ఆర్జీవి పై.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
బాహుబలి సినిమా వరల్డ్ వైడ్ హిట్ తర్వాత రాజమౌళి కి ఊహించని రేంజిలో క్రేజ్ వచ్చింది. అయితే బాహుబలి లాంటి సినిమా తర్వాత మళ్లీ భారీ అంచనాలతో తెరకెక్కించిన చిత్రం త్రిబుల్ ఆర్. టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు సినిమాలో నటించారు. అంతేకాదు ఈ ఇద్దరు హీరోలు కూడా స్వతంత్ర సమరయోధులు అయిన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించడం గమనార్హం. ఇక ఈ సినిమా ని డివివి దానయ్య పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించారు. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు త్రిబుల్ ఆర్ సినిమా మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.

 ఈ క్రమంలోనే ఇక త్రిబుల్ ఆర్ సినిమాకి అటు చిత్ర బృందం శరవేగంగా ప్రమోషన్స్ నిర్వహిస్తుండటం గమనార్హం. ఈ క్రమంలోనే  పలు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్నారు జక్కన్న సహా ఇద్దరు హీరోలు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి కాంట్రవర్షియల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అబద్ధాలు చెప్పడంలో ఆర్జివినీ ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు రాజమౌళి. మగధీర సమయంలో భారీ బడ్జెట్ సినిమాలను ఎక్కువ రోజులు షూటింగ్ చేయను అంటూ రాజమౌళి మాటిచ్చారు. అయితే రాజమౌళి అన్ని సినిమాలు భారీ బడ్జెట్ కావడమే కాదు ఊహించని రీతిలో లేట్ అవుతున్నాయి.  అప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఇలా చేస్తున్నారు అంటూ ప్రశ్నించగా అయితే అనుకున్నట్లుగానే ఈగ మర్యాదరామన్న సినిమాలు తొందరగా కంప్లీట్ చేశాను. కానీ బాహుబలి సినిమా విషయంలో అది కుదరలేదు. ఇక ఆ సమయంలో రాంగోపాల్వర్మ ని స్పూర్తిగా తీసుకుని అబద్ధం చెప్పను అంటూ చమత్కరించాడు జక్కన్న..

  రాజమౌళితో పాటు త్రిబుల్ ఆర్ సినిమా లో నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరు కూడా ఇంటర్వ్యూలో పాల్గొంటూ.. రాజమౌళి తో త్రిబుల్ ఆర్ సినిమా సమయంలో ఉన్న అనుభవాలను పంచుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా త్రిబుల్ ఆర్ ప్రమోషన్ ఇంటర్వ్యూ లకు సంబంధించిన వీడియోలు కనిపిస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: