'గంగుబాయ్ కతియవాడి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Anilkumar
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్  తాజాగా నటించిన చిత్రం 'గంగూబాయి కతియావాడి'. ఈ సినిమా బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలీ కాంబినేషన్‌లో రూపొందింది.అయితే ఆయన కథలను గమ్మత్తైన విధంగా వివరిస్తూ.. వీక్షకులను తన విజువల్స్‌తో అనుభూతి చెందేలా చేస్తూంటారు.ఇకపోతే ఇలాంటి  దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో మంచి ఓపినింగ్స్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమా బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ  ఫిబ్రవరి 25న విడుదల అయ్యింది. అయితే ఇటీవలే ఈ సినిమా  అత్యధిక వసూళ్లతో భారతీయ బాక్సాఫీస్‌ వద్ద రూ. 100 కోట్ల మార్క్‌ను దాటింది. ఇకపోతే ఈ  కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బాలీవుడ్‌కి అతిపెద్ద ఓపెనింగ్స్‌ ఇచ్చిన మూడో చిత్రం గంగూబాయి కతియవాడి.

తాజాగా  ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంది అలియా భట్‌.అలియా భట్ నటించిన  'గంగూబాయి కతియావాడి'అనుకున్న రీతిలో అలరించలేకపోయిందనే టాక్ వినిపించింది. అంతేకాకుండా తెలుగులోనూ ఈ సినిమాని మేకర్స్ విడుదల చేశారు. ఇక ఇక్కడా వర్కవుట్ కాలేదు.ఇకపోతే సరైన ప్రమోషన్ లేకపోవటంతో పట్టించుకునే వాళ్లే కరువు అయ్యారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.కాగా ఈ సినిమా బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  నెట్ ప్లిక్స్ ఓటిటిలో విడుదల కానుందని వినికిడి.ఇక ఈ సినిమా ఏప్రియల్ 25 నుంచి  స్ట్రీమింగ్ కానుంది. కాగా రాజమౌళి రూపొందించిన ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో అజయ్‌ దేవగన్‌, ఇమ్రాన్‌ హష్మి, హ్యూమా ఖురేషీ అతిథి పాత్రల్లో అందరినీ అలరించారు.అంతేకాకుండా  మాఫీయ క్వీన్‌, వేశ్య పాత్రలో అలియా తన అందం, అభినయం, డైలాగ్‌లతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. అయితే ఇప్పటివరకు గ్లామర్‌ రోల్స్‌తో అలరించిన ఈ బ్యూటీ ఈ సినిమాలో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను, విమర్శకులను ఆశ్చర్యపరిచింది.ఇక ఇదిలా వుండగా గంగూబాయ్ ను వేశ్యగా మార్చిన విధానం, ఆ వృత్తిలో ఆమె ఎదిగిన తీరు, రాజకీయ నాయకుల గురించి ఆమె చెప్పే డైలాగులు ఈ సినిమాలో హైలెట్ గా ఉన్నాయి. అయితే  ఈ చిత్రం పవర్ ఫుల్ కంటెంట్‌తో తెరకెక్కింది. గంగూబాయిగా ఆలియా అరిపించేసింది. ఇకపోతే ఆమె ఇలా చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.అంతేకాదు ఒక నటిగా ఆలియాకి ఇది చాలెంజింగ్ పాత్ర అని చెప్పవచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: