నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్న అజిత్..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లో ఎంత మంది హీరోలు ఉంటారు,  కానీ వారిలో కొంత మంది హీరోలు ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాల్లో నటించడానికి  ఆసక్తి చూపిస్తూ ఉంటారు, కానీ కొంత మంది హీరోలు మాత్రం ప్రయోగాత్మకమైన పాత్రలో నటించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు, అలా ప్రయోగాత్మకమైన సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపించే వారిలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఒకరు. అజిత్ ప్రయోగాత్మకమైన సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాడు,  అందులో భాగంగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇప్పటికే అజిత్ తన కెరియర్ లో కల్కి  సినిమాలో  నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు,  ఈ సినిమా  సూపర్ సక్సెస్ అయ్యింది.

 అయితే తాజాగా అజిత్ , హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన వలిమై సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే,  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేదు, ఇది ఇలా ఉంటే హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ 'వలిమై'  సినిమా కంటే ముందే నెర్కొండ పార్వై సినిమాలో నటించాడు.  అయితే మరో సారి హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ ఒక సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి,  అలా అజిత్ , హెచ్ వినోద్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో అజిత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇలా అజిత్ మరోసారి నెగటివ్ షేడ్స్ ఉన్న వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ఒక  వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజా గా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన వలిమై సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల  అయ్యింది, కాక పోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందు కోలేక పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: