వామ్మో: ఆ యువ హీరోకి అన్ని కోట్లు ఖర్చు పెట్టిన మైత్రి మూవీ..!!

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రామిసింగ్, క్రేజీ బ్యానర్ గా పేరు పొందింది మైత్రి మూవీ మేకర్స్.. ఇక ఈ సంస్థ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి మొదటిగా శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ లోకి తన ప్రస్థానాన్ని ప్రారంభించడం జరిగింది.. ఇక దీంతో ఈ బ్యానర్ పై ఎన్నో వరుస క్రేజీ ప్రాజెక్టులు దూసుకుపోతోంది. ఇక ఇటీవల కాలంలోనే పుష్ప, ఉప్పెన వంటి మంచి చిత్రాలను తెరకెక్కించి మంచి లాభాలను సొంతం చేసుకున్నది. అయితే ఇలాంటి సంస్థ ఇప్పుడు ఒక యువ హీరో కోసం కొన్ని కోట్లు ఖర్చు చేయబోతోంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం.

అసలు విషయంలోకి వెళితే అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించడం తో ఈ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బాగా పాపులర్ అయింది అని చెప్పవచ్చు.. అందుచేతనే ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఇక మహేష్ బాబు తో కూడా సర్కారు వారి పాట సినిమాను కూడా ఈ బ్యానర్ పైనే చిత్రీకరిస్తున్నారు.. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన లిరికల్ వీడియో సాంగ్ ఓ రేంజ్ లో ప్రేక్షకులను అభిమానులను ఆకట్టుకుంది. ఇక వీటితోపాటుగా నానితో కలిసి" అంటే సుందరానికి" అనే సినిమాను కూడా నిర్మిస్తున్నారు.
ఇక ఆ తర్వాత హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి తో డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ నిర్మిస్తున్న సినిమాను కూడా ఈ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.. ఇక వీటితోపాటుగా బాలకృష్ణ సినిమా, వాల్తేర్ వీరయ్య మరి కొన్ని సినిమాలను కూడా ఈ బ్యానర్ పైన చిత్రీకరిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తో కూడా ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.. అది కూడా దాదాపుగా 9 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సాహసం చేయడం అనేది పెద్ద రిస్క్ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: