కళావతి సాంగ్: నిన్న సితార.. నేడు మంజుల.. స్టెప్పులకు నెటిజన్లు ఫిదా..!

Anilkumar
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట. గీతగోవిందం ఫేమ్ పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 reels, జి ఎం బి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లపై నవీన్ ఎర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట గోపి ఆచంట మహేష్ బాబు సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ కి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి కళావతి అనే పాటను విడుదల చేయగా.. ఆ పాట యూట్యూబ్లో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. 

ముఖ్యంగా ఈ పాటలో మహేష్ బాబు వేసే హుక్ స్టెప్పులకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ స్టెప్పులను ఇప్పటికే ఈ  కీర్తి సురేష్, మహేష్ బాబు కూతురు సితార, సంగీత దర్శకుడు తమన్ డాన్స్ చేసి అదరహో అనిపించారు. ఇక తాజాగా మహేష్ బాబు సోదరి నటి మంజుల కూడా ఈ లిస్టులో చేరిపోయింది. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె గా వెండితెరపై అడుగు పెట్టిన మంజుల నటిగానే కాకుండా నిర్మాతగా కూడా మారి పోకిరి, ఏ మాయ చేసావే వంటి సినిమాలను నిర్మించింది. ఇక తాజాగా సుమంత్ హీరోగా నటించిన మళ్లీ మొదలైంది సినిమాలో ఓ కీలక పాత్ర కూడా పోషించారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆమె..

తాజాగా కళావతి సాంగ్ ని రీ క్రియేట్ చేసింది. బ్లాక్ టీ షర్ట్, బ్లూ జీన్స్ ధరించిన ఆమె  కళావతి పాటకు అచ్చం మహేష్ బాబు లాగే స్టెప్పులేసింది. ఇక ఆ డాన్స్ వీడియో ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా.. ఆ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన మహేష్ ఫాన్స్, నెటిజన్స్ 'మంజుల గారి డాన్స్ అదరహో' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సర్కారు వారి పాట వేసవి కానుకగా మే 12న విడుదల కాబోతుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తమిళ అగ్ర నటులు సముద్రఖని మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: