ఏపీ సీఎం జగన్ కూ బాలయ్య కూ మధ్య మరో వివాదం రేగనుంది. కొత్త సినిమా లుక్ విడుదల చేసిన బాలయ్య ఆ సినిమాలో మైనింగ్ మాఫియా పై విరుచుకుపడనున్నారని తెలుస్తోంది. కొత్త సినిమా బాలయ్య 107వ చిత్రం కావడం, క్రాక్ సినిమాతో బంపర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని కావడంతో ఇంకొన్నివిశేషాలను సైతం పోగేసుకుంది.ఈ సినిమాకు అఖండ తో ఓ రేంజ్ లో ఆర్ ఆర్ అందించిన తమన్ సంగీతం ఇస్తున్నారు.ఎప్పటిలానే గోపీచంద్ మలినేని తన లక్కీ ఛార్మ్ శ్రుతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.
ఇక కథ విషయానికి వస్తేఇప్పటికే అఖండ సినిమాలో బాలయ్య డైలాగులు అన్నీ ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి పలికినవే! అంచనా వేయడానికి నువ్వేమయినా పోలవరం డ్యామ్ వా పట్టి సీమ తూమువా...పిల్ల కాలువ అంటూ హడావుడి చేసి ఓ రేంజ్ లో డైలాగులు చెప్పిన బాలయ్య..మరో సారి తన గర్జనతో బాక్సాఫీసుకు పండగ కళ తీసుకురాబోతున్నారు.ముఖ్యంగా మైనింగ్ మాఫియా అన్నది ఆంధ్రావని వ్యాప్తంగా ఉంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలా అయితే ఆ రోజు వైఎస్సార్ హయాంలో మైనింగ్ అక్రమాలు, గనుల తవ్వకాల్లో నిబంధనలు దాటి లీజు వ్యవహారాలు నడిచాయో ఇప్పుడూ అదే విధంగా ఉన్నాయి.ఓ విధంగా నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో కూడా మైనింగ్ హాయిగా సాగిపోతోంది.
గత కొద్ది కాలంగా మావోయిస్టుల కదలికలు విశాఖ మన్యంలో లేకపోవడంతో నక్కపల్లి పరిసర ప్రాంతాలలో వైసీపీ పెద్దల మద్దతుతో మైనింగ్ మాఫియా రెచ్చిపోయి రంకెలేస్తుంది అన్న వాదనకు బలం చేకూరుస్తూ ఇటీవల ఆధార సహితంగా ఈనాడు మీడియా కథనాలు రాసింది.బెదిరింపులు కూడా ఎదుర్కొంది.ఈ నేపథ్యంలో డైరెక్టర్ గోపీచంద్ మలినేని కొంత రీసెర్చ్ చేసి యథార్థ ఘటనకు కాల్పనిక ధోరణి చేర్చి ఈ సినిమాను రూపొందిస్తున్నారు అని టాలీవుడ్ సమాచారం.బాలయ్య ఈ సినిమాలో ఎప్పటిలానే ఓ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు.