మెగా హీరోలు.. అనుకుని చేశారా..అనుకోకుండా చేశారా..!!

P.Nishanth Kumar

తెలుగు సినిమా పరిశ్రమలో మెగా హీరోల హవా ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎన్నో రకాల సినిమాలను ఎన్నో జోనర్లలో సినిమాలను చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన మెగా హీరోలు ఇప్పుడు చారిత్రాత్మక నేపథ్యంలోని కథలతో సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా ప్రేక్షకులలో భారీ స్థాయిలో ఇమేజ్ ఉన్న మెగా హీరోలు ఇప్పుడు ఇలాంటి చారిత్రాత్మక సినిమాలు చేయడానికి కారణం ఏమిటో తెలియదు కానీ ముగ్గురు మెగా హీరోలు మాత్రం ఈ చారిత్రాత్మక సినిమాలను చేస్తూ ప్రేక్షకులను భారీస్థాయిలో అలరిస్తున్నారు. మొదటగా మెగాస్టార్ చిరంజీవి సైరా అనే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాలు చేశారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర గా ఈ సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ ను అందుకున్న చిరు ఈ సినిమా తో వసూళ్లు బాగా అందుకొలేక పోయినా  ప్రేక్షకులను అలరించాననే సంతృప్తి పొందడం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దారిలోనే వెళుతున్నాడు. ఆయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే చారిత్రాత్మక నేపథ్యం కలిగిన సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొనెలా చేసింది. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా దసరా కి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

మొగలుల కాలంలో జరిగే ఓ కథను తయారుచేసిన క్రిష్ పవన్ ను గజ దొంగ పాత్రలో చూపించబోతున్నారు. మరి ఈ చిత్రం ఎంతటి స్థాయిలో వసూళ్లను సాధిస్తుందో చూడాలి. ఇక రామ్ చరణ్ కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నాడు. ఈ జనరేషన్ హీరోలకు పవర్ ఫుల్ పాత్రలు లభించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి పాత్ర రామ్ చరణ్ కు చాలా తక్కువ సమయంలోనే వచ్చింది. నటుడిగా తనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించే అలాంటి పాత్రలో చరణ్ ఎలా చెలరేగి పోయి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: