రాకింగ్ రాకేష్, జోర్ధార్ సుజాత పెళ్లి గురించి జబర్దస్త్ బాబు ఏమన్నాడంటే..?

Anilkumar
జబర్దస్త్ కమెడియ్‌ రాకింగ్ రాకేష్ గురించి  మనందరికీ తెలిసిందే. రాకింగ్ రాకేష్ సుదీర్ఘ కాలంగా జబర్దస్త్‌ లో అందరిని ఆకట్టుకుంటూ ఉన్నాడు. అయితే రాకేష్ చిన్న పిల్లలతో కలిసి స్కిట్‌ లు చేసి తన మీదే పంచ్‌ లు వేయించుకుని అందరిని ఎంతగానో నవ్విస్తూ ఉంటాడు.ఇక ఇప్పుడు టీం లీడర్ గా జబర్దస్త్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు.  అయితే తాజాగా అతడు తన సహా నటి అయినా జోర్దార్ సుజాత తో ప్రేమలో పడ్డట్టుగా అధికారికంగా ప్రకటించాడు. కాగా గత కొన్ని రోజులుగా సుజాత మరియు రాకేష్‌ లు కలిసి జబర్దస్త్ లో సందడి చేస్తున్నారు. ఇక  ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడ సన్నిహిత్యం ప్రేమగా మారిందట. అంతేకాదు ఇద్దరు కూడా స్కిట్లలో కామెడీ పండించడం కోసం లవ్ లో ఉన్నట్లు గా

 నటిస్తున్నారేమో అని అంతా అనుకున్నారు. అయితే తాజాగా ఇటీవల జరిగిన వాలెంటైన్స్ డే స్పెషల్ శ్రీదేవి డ్రామా కంపెనీలో వారిద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టారు.  కాగా రాకింగ్ రాకేష్ అదే సమయంలో ఒక రింగ్ పెట్టి మరి సుజాతకు ప్రపోజ్ చేశాడు. అంతేకాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్‌ పై ఇద్దరి వివాహ నిశ్చితార్ధం కూడా అయినట్లే అంటున్నారు.  అయితే  అందరి విషయం తెలియదు గానీ.... జబర్దస్త్ లవ్ స్టోరీల విషయం పక్కన పెడితే సుజాత మరియు రాకేష్‌ ప్రేమ వ్యవహారం నిజమైనదని క్లారిటీ వచ్చేసింది.  అంతేకాదు త్వరలోనే వీరిద్దరి పెళ్లి కూడా చేసుకోబోతున్నారట.

అయితే ఇటీవల జబర్దస్త్ కామెడియన్‌ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాకేష్ మరియు సుజాత ఈడు జోడు చాలా బాగుంటుంది.ఇక వారిద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రయాణిస్తూ ఉంటారు.అయితే ప్రతి ఒక సందర్భంలో వాళ్లిద్దరూ ఒకరి పై ఒకరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. కాగా వారిద్దరు కలిసి జీవితం పంచుకుంటే కచ్చితంగా బాగుంటుంది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.  అంతేకాదు ఈ సంవత్సరంలోనే వారి పెళ్లి జరగబోతుంది అంటూ బాబు చెప్పుకొచ్చాడు.అయితే బాబు చెబుతున్న దాని ప్రకారం చూస్తుంటే ఈ ఏడాది చివరి వరకు రాకేష్ మరియు సుజాత పెళ్లి పీఠలు ఎక్కడం ఖాయం అనిపిస్తుంది.  వీరిద్దరూ ఒకటి అవ్వడం మాత్రమే కాదు.... ఆ తర్వాత జబర్దస్త్ లో కూడా సందడి చేయడం జరుగుతుందని తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: