వామ్మో.. కళావతి లిరికల్ సాంగ్ కోసం అంత ఖర్చు చేశారా..?

Anilkumar
ప్రస్తుతం టాలీవుడ్లో ట్రెండ్ మారిపోయింది. ఓ సినిమా పై భారీ హైప్ రావడానికి సినిమాలోని పాటలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికీ అది చాలా సినిమాలతో నిరూపితమైంది కూడా.ఇక అందుకు అనుగుణంగానే సినీ నిర్మాతలు కూడా పాటల విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీ అవుతున్నారు. ఈమధ్య లిరికల్ పాటల కోసమే సపరేట్గా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. మేకర్స్ సరికొత్తగా సింగర్స్ తో పాడించడం దానికి మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేయడం వాటన్నిటినీ లిరికల్ సాంగ్ లో జత చేసి విడుదల చేస్తున్నారు. దీని కోసం నిర్మాతలు ప్రత్యేకంగా బడ్జెట్ ను కూడా కేటాయిస్తున్నారు.

అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురం లో చిత్రం లోని 'సామజవరగమన' లిరికల్ సాంగ్ కోసం నిర్మాతలు ఏకంగా కోటి రూపాయలు ఖర్చు పెట్టారట. అందుకు తగ్గట్టే ఆ పాటతో  సినిమా క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కి కూడా ఏకంగా 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకు ఈ పాటను తొమ్మిది కోట్ల మంది వీక్షించారు.ఇక ఇప్పుడు ఈ లిస్టులో తాజాగా విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' చిత్రంలోని 'కళావతి' పాట కూడా చేరింది. ఈ పాట కోసం మేకర్స్ దాదాపు 60 లక్షల రూపాయలు ఖర్చుపెట్టినట్లు సమాచారం. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ పాటను విడుదల చేయాలని అనుకున్నారు.

కానీ విడుదలకు ముందే ఈ పాట లీక్ అయింది. దాంతో చేసేది ఏమీ లేక ఒకరోజు ముందే విడుదల చేశారు. అయితే ఈపాటకి ఇప్పుడు యూట్యూబ్లో విశేషమైన స్పందన వచ్చింది. కేవలం 24 గంటల్లోనే ఈ పాట ఏకంగా 15 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్ లోనే అత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ వీడియోగా రికార్డు క్రియేట్ చేసింది. అంతే కాదు లైక్స్ పరంగా కూడా ఈ పాట ఏకంగా 9 లక్షల లైక్స్ ని అందుకుంది. గీతగోవిందం ఫేమ్ పరశురాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.14 రీల్స్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారితో కలిసి సంయుక్తంగా మహేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వేసవి కానుకగా మే 12న విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: