డింపుల్ హయాతి గోల్డెన్ ఛాన్స్.. హిట్ కొడితే అంతే!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొంత మంది హీరోయిన్ లకు ఎప్పుడు ఎలా అదృష్టం కలిసి వస్తుందో ఎవరూ చెప్పలేరు. సినిమాల్లో సరైన నటన కనబరిచకపోయిన సరైన విధంగా గ్లామర్ చూపించలేకపోయినా సదరు హీరోయిన్ కు అవకాశాలు రావు. కానీ ఫ్లాప్ సినిమాలో మంచి ప్రదర్శన కనపరిస్తే ప్రేక్షకులను ఆకట్టుకుంటే మాత్రం తప్పకుండా ఆ హీరోయిన్ కు మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పడానికి నిదర్శనం డింపుల్ హయాతి. తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె గల్ఫ్ అనే చిత్రంతో పరిచయం అయ్యింది.

ఆ తర్వాత ఒకటి రెండు చిన్న సినిమాల్లో కనిపించిన ఈమె గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి అందరిని ఒక్కసారిగా ఆకట్టుకుంది. హీరోయిన్ మెటీరియల్ అనిపించేలా ఆమె ఆ పాటలో నటించిన తీరు కు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయారు. ఆ చిత్రం తర్వాత ఈమె హీరోయిన్ గా ఎప్పుడు చేస్తుందా అనే విధంగా అందరూ ఎదురు చూశారు. ఆ విధంగా రవితేజ సరసన ఈమె కిలాడి చిత్రంలో నటించగా తన గ్లామర్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది సినిమా ప్లాప్ అయినా కూడా ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమాలో మరొక హీరోయిన్ ఉన్న కూడా ఈమె ఆమె కంటే ఎక్కువగా గ్లామర్ ప్రదర్శించి మంచి నటనను కనబరిచి ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. అయితే తాజాగా ఈమె గోపీచంద్ సరసన హీరోగా నటించబోయే ఈ అవకాశాన్ని దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు ఎంపిక చేశాడట దర్శకుడు. తన నటనతో గ్లామర్ తో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎంత స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. అంతేకాదు మరింత మంది యువ హీరోలు ఈమెను హీరోయిన్ గా తమ సినిమాలలో పెట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: