"జై భీమ్" సూర్య ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశ?

VAMSI
ఇండియన్ సినిమాకు ఉన్న సుదీర్ఘ చరిత్రలో ఎందరో మహా నటులు తమ నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. అయితే కొందరు నటీ నటులు మాత్రం ఇప్పటికీ ప్రజల మనసుల్లో చెరిగిపోని గుర్తులను మిగిల్చి వెళ్లారు. వీరు నటన కోసం ఎంత చెయ్యాలో అంత చేస్తారు. ఎటువంటి పాత్ర అయినా చేయడానికి సిద్దంగా ఉంటారు. నేటి సినిమా కాలంలో అటువంటి వారు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు అని చెప్పుకోవడానికి బాధగా ఉంది. అలా ప్రేక్షకులను తన దైన నటనతో కొత్త కొత్త పాత్రలు చేస్తూ మెప్పించిన హీరో సూర్య. ఈయన తమిళ్ సినిమా పరిశ్రమకు చెందిన వాడు అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులలో కూడా విపరీతమైన అభిమానాన్ని సంపాదించుకున్నాడు.
ఇప్పుడు దేశంలో ఉన్న సూర్య ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశ పడే ఒక వార్త గురించి తెలుసుకుందాం. గత సంవత్సరం సూర్య ప్రధాన పాత్రలో మరియు టీజీ జ్ఞానవెల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం జై భీమ్. ఇది ఒక కోర్టు డ్రామాగా ప్రజల ముందుకు వచ్చి అందరినీ ఎంతగానో ఆకట్టుకుని ఒక మంచి చిత్రంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. అయితే దీనికి చలనచిత్ర పరంగా ఎన్నో రికార్డులు వచ్చాయి. అయితే అంతర్జాతీయ స్థాయిలో అధిక ప్రాధాన్యత ఉన్న ఆస్కార్ అవార్డ్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లోకి వెళుతుందని చిత్ర బృందంతో పాటుగా యావత్ భారతదేశం ఆశపడింది.
కానీ ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ కు అర్హత సాధించ లేదని అధికారికంగా తెలిసిపోయింది. ఈ వార్త గత రాత్రి 7 గంటలకు జై భీమ్ ఆస్కార్ బరి నుండి తొలగిపోయినట్లు ప్రకటించారు. ఈ వార్తతో అభిమానులు అంతా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. 276 సినిమాల్లో జై భీమ్ అక్కడి వరకు చేరుకుంది. అయితే సూర్య అభిమానులు మాత్రం ఒక చిన్న సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని ఎంతో గర్వ పడుతున్నారు. ఈ చిత్రం ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీ లో సెలెక్ట్ అయింది. కానీ షార్ట్ లిస్ట్ చేసిన చిత్రాలలో స్థానం సంపాదించడంలో విఫలం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: