మహేష్ బాబు పిల్లలకు ఆపరేషన్ లు చేయించడం వెనుకున్న కథ తెలుసా?

VAMSI
ధనవంతులు చాలా మందే ఉంటారు. కానీ అందరికీ దానం చేసే గుణం ఉండదు కొందరు మాత్రమే తమ దగ్గర ఉన్న ధనంలో ఎంతో కొంత సాయం కోరే చేతికి అందించాలని కోరుకుంటారు. అలాంటి అరుదైన వారిలో ఒకరు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు. పిల్లలకు సాయం అందించడానికి ఈ రియల్ హీరో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. వంద లాది మంది పిల్లలకి సాయం అందిస్తున్న ఈ హీరో ఎడమ చేతికి అందించిన సాయం కుడి చేతికి తెలియకూడదు అన్నట్టుగా ఉంటున్నారు. ఇప్పటి వరకు 1010 మందికి పైగా గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న పిల్లలకు అవసరమైన సర్జరీలు చేయించి వారి జీవితాలను నిల బెట్టారు మహేష్ బాబు.
అయితే మహి పిల్లలకు ఇలా సాయం అందించడానికి ప్రేరణ తన తనయుడు గౌతమేనట. అసలేం జరిగింది అంటే గౌతమ్ పుట్టినపుడు మహేష్ బాబు అరచేయి అంత పరిమాణంలో ఉన్నాడంట. అలా తన ముద్దుల కొడుకుని ఆలా చూడగానే మనసు తరుక్కు పోయిందట. అయితే ఏదో అనారోగ్య కారణం వలన ఆలా జరిగిందని డాక్టర్ ల ద్వారా తెలిసింది. అపుడు ఆరోగ్యం బాగు చేయడానికి  చాలానే ఖర్చు చేశారంట ఆ తరవాత ఆరోగ్యం బాగయ్యింది. ఇపుడు ఆరుడగులు ఉన్న గౌతమ్ కి అప్పట్లో అలా అయ్యింది. మాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి సరి పోయింది.
ఇదే సమస్య పేద వారికి వస్తే వారి పరిస్థితి ఏమిటి ఆ చిన్నారుల భవిష్యత్తు ఏమిటా అన్న ఆలోచన మహేష్ కు అప్పుడే వచ్చిందంట. అందుకే చిన్నారులకు అనారోగ్య సమస్య అంటే మహి గుండె కరిగిపోతుంది. సాయం అందించడమే కాదు ఆ చిన్నారుల ఆరోగ్యం కుదుట పడే వరకు వారి గురించి జాగ్రత్తలు తీసుకుంటారట. ఇప్పుడు ఎందరో తల్లితండ్రులు మహేష్ పేరును జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: