నాగార్జున సినిమా టైటిల్ తో హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్..?

Anilkumar
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో సినిమాకి అనుకున్న టైటిల్ మరో మరో హీరో ఆ సినిమాను చేసి మంచి హిట్ ను కొట్టడం ఇండస్ట్రీలో చాలా సాధారణమైన విషయం.అయితే అలాగే ఒక హీరో కోసం అనుకున్న టైటిల్‌తో అనుకోకుండా మరో హీరో సినిమా చేయాల్సి వస్తుంది.ఇక తమ సినిమా కోసం అనుకున్న టైటిల్‌ను మరో హీరో కోసం త్యాగం చేస్తూ ఉంటారు. అప్పట్లో రవితేజ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో కత్తి సినిమా అనుకున్నారు. అయితే ఆ తర్వాత కళ్యాణ్‌రామ్ కూడా అదే టైటిల్ అనుకోవడంతో ....చివరకు ఆ టైటిల్ కళ్యాణ్‌రామ్‌కు వదిలిపెట్టి గుణశేఖర్ తన సినిమాకు నిప్పు టైటిల్ పెట్టుకున్నారు.

ఇకపోతే అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా చాలా డిఫరెంట్.అయితే ఈ సినిమా  కోడి రామకృష్ణ శిష్యుడు పీఏ. ఆరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో కిక్ బాక్సింగ్ నేపథ్యంలో  ఈ సినిమా కథ, కథనాలు, పవన్ కళ్యాణ్ స్టైలిష్ నటన, దర్శకుడి ప్రెష్ టేకింగ్‌. ప్రీతి జింగానియా, అతిధి గోవికర్ అందాలు.. రమణ గోగుల పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకు హైలెట్ అవ్వడం జరిగింది. అయితే అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్ హీరోగా వచ్చిన సినిమా స్ఫూర్తితో  రావడం జరిగింది.హిందీలో ఆ సినిమా సైక్లింగ్ నేపథ్యంలో ఉంటుంది. అయితే మన వాళ్లు మాత్రం ఈ సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో ఎంచుకున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే అంతకుముందే ఈ టైటిల్‌ను నాగార్జున సినిమా కోసం రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ముందుగా ఈ సినిమాను ముందుగా వైవీఎస్‌. చౌదరి దర్శకత్వంలో హరికృష్ణ - నాగార్జున కాంబోలో వచ్చిన సీతారామరాజు సినిమాకు ముందుగా తమ్ముడు టైటిల్ అనుకున్నారు.  అయితే నాగార్జునను అయితే తమ్ముడు టైటిల్ కావాలని దర్శకుడు పీఏ. ఆరుణ ప్రసాద్ అడగడంతో ఇచ్చేయడం జరిగింది.ఇకపోతే అప్పట్లో తమ్ముడు టైటిల్‌తో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే.. అన్న చిరు అన్నయ్య టైటిల్‌తో సినిమా చేశారు. ఈ రెండూ హిట్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: