ప్రియుడి మీద మోజుతో భర్త కు విడాకులిచ్చిన ఆ హీరోయిన్

D.V.Aravind Chowdary
సినీ ఇండస్ట్రీలో ప్రేమలు , బ్రేకప్ లు , సహజీవనాలు, పెళ్ళిళ్ళు , విడాకులు అనేవి ఈ మధ్య కాలంలో సర్వసాధారణం అయ్యాయి. నచ్చితే ముందుగా సహజీవనం చేస్తూ ఆ పైన వివాహాలు చేసుకోవడం అనేది కొంత కాలం నుంచి ఉన్న ఈ మధ్య ఇంకా ముందుకు జరిగి తమకు స్వతంత్రం పోయింది అని  పెళ్ళిళ్ళు పెటాకులు చేసుకుంటున్న జంటల జాబితా ఎక్కువవుతోంది. ఇది కేవలం ఒక్క ఇండస్ట్రీ అని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినీ ఇండస్ట్రీలలో జోరుమీదున్న ట్రెండ్. 



పైన పేర్కొన్న ఉద్దంతానికి సరిగ్గా సరిపోతుంది ఇప్పుడే నేను  వ్రాయబోతున్న హీరోయిన్, ఇంతకీ ఎవరూ ఆ హీరోయిన్ అని, ఆమె భర్త, ప్రియుడు ఎవరని ఆసక్తి చూపుతున్నారా , అయితే కింద చదివేయండి. 



కిమ్ శర్మ ... ఈ పేరు ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా, ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత హాటెస్ట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నిన్నటి తరం కథానాయిక, అంతెందుకు కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం చిత్రం లో మెయిన్ హీరోయిన్. కెరీర్ పరంగా హిట్ అయ్యిందో లేదో కానీ వ్యక్తిగత జీవితం పరంగా మాత్రం సూపర్ హిట్ అయ్యింది.



మొహబత్తెన్ చిత్రం ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కిమ్ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. తెలుగు లో వచ్చిన ఖడ్గం చిత్రం ఆమె కెరీర్ భారీ హిట్ చిత్రం. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన కూడా మంచి ప్రాధాన్యత లేని పాత్రలు చేస్తూ కాలం గడిపుతున్న సమయంలోనే ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో ప్రేమ వ్యవహారం ఆమెను బాగా వార్తల్లోకి ఎక్కించింది. యువరాజ్ తో కొంతకాలం సహజీవనం చేసి విడిపోయింది. 

 

యువరాజ్ తర్వాత ఒక స్పానిష్ సింగర్ తో డేటింగ్ చేసి ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఇద్దరికి పొసగక విడిపోయారు. ఆ తర్వాత కెన్యా కు చెందిన వ్యాపారవేత్త అలీ పుంజాని ని వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే తన కంటే వయస్సు లో చాలా పెద్దవాడైన అలీ ని డబ్బు కోసమే చేసుకుంది అని అప్పట్లో బాలీవుడ్ మీడియా కోడై కూసింది. 



అలీ తో వివాహా బంధం లో ఉన్న తన మాజీ ప్రియుడు యువరాజ్ మీద ఇంకా ఇష్టం ఉండటంతో ఇండియా వచ్చి అతన్ని కలిసేది ఆ సమయంలో నే యువరాజ్ క్యాన్సర్ తో బాధపడుతున్న సమయంలో అతనికి ధైర్యాన్ని చెప్పేది. యువరాజ్ కోలుకున్న తర్వాత వాళ్లిద్దరూ మంచి స్నేహితులు గా ఉండిపోయారు .
 వీరిద్దరి మధ్య వ్యవహారం తో విసిగిపోయిన  భర్త అలీ వారించిన వినకుండా 2017లో విడాకులు తీసుకుంది. విడాకులు భరణంగా ఆమెకు భారీగా ముట్టింది అని బాలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది. భర్తతో విడిపోయిన తర్వాత ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్జున్ ఖన్నా తో, నటుడు హర్షవర్ధన్ రాణే తో ప్రేమాయణం కొనసాగించిన కిమ్ ప్రస్తుతం భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తో డేటింగ్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: