నాచురల్ స్టార్ నాని చేతుల మీదగా 'భళా తందానాన' టీజర్

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ హీరో కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించినప్పటికీ ఆ తరువాత హీరోగా మారి టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఇప్పటికే శ్రీ విష్ణు అనేక డిఫరెంట్ సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు,  అది మాత్రమే కాకుండా ప్రస్తుతం కూడా వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భళా తంద నాన టీజర్ విడుదల అయ్యింది,  ఈ టీజర్ ను నాచురల్ స్టార్ నాని విడుదల చేశాడు. భళా తందనాన'' సినిమా వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్. 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది, సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజిని కొర్రపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భళా తందనాన మూవీ లో శ్రీ విష్ణు సరసన క్యాథరిన్ ట్రెసా హీరోయిన్ గా నటిస్తోంది, ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.

రాక్షసుడుని చంపడానికి దేవుడు కూడా అవతారాలు ఎత్తాలి' అని చెప్తుండంతో ఈ సినిమా టీజర్ ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు ఒక జర్నలిస్ట్ గా నటించినట్లు తెలుస్తోంది, అయితే తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం అనుకోని పరిస్థితుల్లో అతను గన్ పట్టుకొని వైలెంట్ మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. నీ దారిలో నువ్వు.. నా దారిలో నేను.. ఇద్దరి లక్ష్యం' ఒక్కటే అని చెప్పడం చూస్తుంటే శ్రీవిష్ణు - క్యాథరిన్ ఇద్దరూ ఒకే లక్ష్యం కోసం వేర్వేరు దారుల్లో వెళ్తున్నారని ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. సత్య - పోసాని కృష్ణ మురళి - అయ్యప్ప పి శర్మ - చైతన్య కృష్ణ - రవి వర్మ - శ్రీకాంత్ అయ్యంగార్ - ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: