రెండు దశాబ్దాల తరువాత మళ్ళీ బాలయ్య ఖాతాలో ఆ ఫీట్..

Purushottham Vinay
ప్రతి స్టార్ హీరో కెరీర్ లో కూడా కొన్ని సినిమాలు ప్రత్యేకమైన సినిమాలుగా నిలవడంతో పాటు ఊహించని స్థాయిలో రికార్డులను సొంతం చేసుకుంటాయి. బాల కృష్ణ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నా కాని గత నెలలో విడుదలై మంచి సక్సెస్ సాధించిన అఖండ సినిమా గురించి ప్రేక్షకుల మధ్య ఇప్పుడు ఇంకా జోరుగా చర్చ జరుగుతోంది.ఇక మూడు రోజుల క్రితం ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటుండటం గమనార్హం.ఇక నందమూరి నటసింహం బాలయ్య నటనకు ఫిదా అవుతున్న అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఓటీటీలో అఖండ సినిమా అందుబాటులోకి వచ్చినా తెలుగు రాష్ట్రాల్లోని పరిమిత సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా రన్ అవుతుంది.

ఇక 2001 వ సంవత్సరంలో బాల కృష్ణ నటించి విడుదలైన నరసింహ నాయుడు సినిమా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కోటి రూపాయల మార్క్ ను టచ్ చేసిన విషయం తెలిసిందే. దాదాపుగా రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన అఖండ సినిమా అదే ఫీట్ ను రిపీట్ చేసింది.సుదర్శన్ హాల్ లో నిన్నటి కలెక్షన్లతో అఖండ సినిమా ఖాతాలో ఈ రికార్డ్ చేరింది. అఖండ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు రికార్డులు సృష్టిస్తుండటంతో బాల కృష్ణ అభిమానులు సోషల్ మీడియా వేదికగా చాలా హంగామా చేస్తున్నారు. ఫుల్ రన్ లో ఈ సినిమా దాదాపుగా 74 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను సాధించింది. బాల కృష్ణ అఖండ సినిమా విజయం ఇచ్చిన సంతోషం వల్ల ఆయన హీరోగా తెరకెక్కే కొత్త సినిమాలను వేగంగా మొదలుపెట్టాలని ఆయన అనుకుంటున్నారు.టాలీవుడ్ ఊరమాస్ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన అఖండ సినిమాలో బాలయ్య రెండు పాత్రలో నటించాడు. ఇక హీరోయిన్ గా ఇందులో ప్రగ్యా జైస్వాల్ నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: